షుగర్, గుండె జబ్బులకు చెక్ పెట్టాలా? అయితే ఈ ఉడికించిన ఆహారమే మీకు దివ్యౌషధం!
Brown basmati rice Benefits : మధుమేహం (డయాబెటిస్), చెడు కొలెస్ట్రాల్ మరియు గుండె సమస్యలతో ప్రతిరోజూ ఇబ్బంది పడుతున్నారా? మందులు వాడకుండా సహజంగా వీటిని నియంత్రించాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రత్యేకమైన ఆహారాన్ని కేవలం ఉడికించి తింటే చాలు, మీ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇంతకీ ఆ అద్భుతమైన ఆహారం ఏంటి? దాన్ని ఎలా ఉడికించి తినాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి!
మనం సాదరణంగా ఫ్రైడ్ రైస్, పలావ్, బిరియాని చేసుకున్నప్పుడు సాదారణ బాసుమతి రైస్ వాడుతూ ఉంటాం. అలా కాకుండా Brown basmati rice వాడితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ బియ్యాన్ని తినటం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

రక్త నాళాల్లో రక్త ప్రవాహం బాగా సాగి రక్తపోటు కూడా నియంత్రణలో ఉండుట వలన గుండెకు సంబందించిన సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ బియ్యంలో విటమిన్ బి కాంప్లెక్స్ సమృద్దిగా ఉంటుంది. ధియామిన్ అనే రసాయన పదార్ధం ఉండుట వలన మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అలాగే నియాసిన్ మరియు ధియామిన్ అనేవి నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
గ్లైజమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు ఏమి ఉండవు. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కొన్ని రకాల క్యాన్సర్ ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ మీ ఆహారంలో 3 ఔన్సుల తృణధాన్యాలు (Brown basmati rice) చేర్చడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని 17% తగ్గించవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

