Healthhealth tips in telugu

కండరాల నొప్పులు, తిమ్మిర్లకు దివ్యౌషధం: మనందరికీ తెలిసిన ఈ ఆకుతో అద్భుత ప్రయోజనాలు!

Muscle cramps :కండరాల నొప్పులు, తిమ్మిర్లు మరియు మజిల్ క్రాంప్స్ తో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని మందులు వాడినా ఫలితం లేదా? అయితే మనందరికీ సుపరిచితమైన, మన ఇంటి చుట్టుపక్కల దొరికే ఒక అద్భుతమైన ఆకుతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆ ఆకు ఏంటి? దాన్ని ఎలా వాడాలి? అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ దాదాపుగా పారిజాతం మొక్కను ఇంటిలో పెంచుకుంటున్నారు. పారిజాతం పూలను దేవుని పూజకు వాడుతూ ఉంటారు. పారిజాతం ఆకు,పువ్వు,వేరు,కాండం ఇలా ఈ మొక్కలో అన్నీ బాగాలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉప యోగిస్తారు. రెండు పారిజాతం ఆకులను తీసుకొని శుభ్రంగా కడగాలి.
parijat leaves
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కడిగిన పారిజాతం ఆకులను ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మూడు నిమిషాల పాటు మరిగిస్తే ఆ ఆకులోని పోషకాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి ఉదయం సమయంలో తాగాలి. ఈ విధంగా తాగటం వలన కండరాల నొప్పులు, కండరాల తిమ్మిరి, మజిల్ క్రాంప్స్ తగ్గుతాయి.

అలాగే ఈ నీటిని తాగటం వలన డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే అజీర్ణం,గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ నీటిని తాగటానికి అరగంట ముందు ఏమి తీసుకోకుండా ఉంటే మంచిది. పారిజాతం ఆకులు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. పారిజాతం ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఆ పొడిని కూడా వాడవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."