పిల్లల లంచ్ బాక్స్ స్పెషల్: స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఇలా చేస్తే ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు!
Corn friedRice:ఉదయం హడావిడిలో పిల్లల స్కూల్ లంచ్ బాక్స్ కోసం త్వరగా అయిపోయే రెసిపీ కోసం వెతుకుతున్నారా? అయితే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే ‘స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్’ (Sweet Corn Fried Rice) బెస్ట్ ఆప్షన్. స్వీట్ కార్న్‌లోని కమ్మటి తీయదనం, కూరగాయల రుచి కలగలిపి ఈ ఫ్రైడ్ రైస్ ఎంతో అద్భుతంగా ఉంటుంది.
పిల్లలు స్వీట్ కార్న్ చాలా ఇష్టపడతారు కాబట్టి, ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పెడితే లంచ్ బాక్స్ ఖాళీగా ఇంటికి రావడం ఖాయం. రాత్రి మిగిలిన అన్నంతో లేదా అప్పటికప్పుడు వండిన వేడి అన్నంతో కూడా దీన్ని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే తక్కువ పదార్థాలతో, కేవలం 10 నిమిషాల్లో రెస్టారెంట్ స్టైల్ రుచిని అందించే ఈ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం ఏంటో చూసేద్దాం!
కార్న్ ఫ్రైడ్ రైస్.. కార్న్ తో చేసే ఏ స్పెషల్స్ అయినా అదిరిపోయే రుచితో ఉంటాయి. ముఖ్యంగా రైస్ తో మిక్సి చేసి చూడండి ఒక్క ముద్ద కూడా విడిచి పెట్టకుండా తినేస్తారు.
కావాల్సిన పదార్ధాలు
స్వీట్ కార్న్ –
వండిన అన్నం – 1 ½ కప్పు
క్యారెట్ ముక్కలు- ¼ కప్పు
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 3
కరివేపాకు – ½ కప్పు
ఉప్పు – 1 టీ స్పూన్
పెప్పర్ పౌడర్ – ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
గరం మసాలా – ¼ టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 3
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని టీ స్పూన్ బటర్ లేకా నెయ్యిని వేసి వేడిచేసుకోవాలి.
2.అందులోకి ఉల్లిపాయ తరుగు,వెల్లుల్లి రెబ్బలు,పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
3.క్యారేట్ తురుము,కరివేపాకు,కార్న్ వేసి ఫ్రై చేసుకోవాలి.
4.రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక అందులోకి మిరియాల పొడి,గరంమసాలా వేసి ఉడికించిన అన్నం వేసి కలుపుకోవాలి.
5.చివరగా కొత్తిమీర చల్లుకోని అన్నాన్ని బాగా టాస్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే.

