బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగితే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?
Biryani and cool drink :ఘుమఘుమలాడే బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే, వేడి వేడి బిర్యానీ తింటూ దానికి కాంబినేషన్‌గా చల్లటి కూల్ డ్రింక్ (సాఫ్ట్ డ్రింక్) తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.
ఈ రెండు కలిపి తీసుకుంటే వచ్చే మజానే వేరు అనుకుంటారు. కానీ, రుచికి అద్భుతంగా అనిపించే ఈ కాంబినేషన్ మీ ఆరోగ్యానికి ఎంత పెద్ద ముప్పు తెస్తుందో మీకు తెలుసా?
బిర్యానీలోని మసాలాలు, నూనెలు జీర్ణం కావడానికి మన శరీరానికి సమయం పడుతుంది. అలాంటి సమయంలో అధిక చక్కెర, కార్బొనేషన్ ఉండే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల జీర్ణక్రియ తీవ్రంగా దెబ్బతింటుంది.
గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట (Acidity) రావడమే కాకుండా దీర్ఘకాలంలో స్థూలకాయం, మధుమేహం వంటి ప్రమాదకరమైన జబ్బులకు దారి తీస్తుంది.
బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగితే మన శరీరంలో అసలు ఏం జరుగుతుంది? వైద్యులు దీని గురించి ఏం హెచ్చరిస్తున్నారు? తక్షణమే ఈ అలవాటును ఎందుకు మానుకోవాలి? తదితర నమ్మలేని నిజాలను ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం.
మనం ఏదైనా పెద్ద హోటల్‌కి, రెస్టారెంట్‌కి వెళ్తే బిర్యానీలో తింటూ, కూల్ డ్రింక్ తాగుతూ బిర్యానీని ఎంజాయ్ చేస్తాము. అలాగే పిజ్జా తింటూ కూల్ డ్రింక్ అమృతంలా భావిస్తాము. మరి అలాంటి కూల్‌డ్రింక్‌లో 15 చెంచాలు సరిపడా ఘగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత ఘగర్ తింటే వాంతులు వస్తాయి.

అయితే కూల్ డ్రింక్ తయారు చేసే కంపెనీ ఫోస్పరిక్ అనే అమ్లం కలుపుతారు అందుకే వాంతులు కావు. దీనివల్ల కొవ్వుగా మారి శరీర బరువు పెరుగుతుంది. ఇంకా మనకు దాహం వేస్తే కూల్ డ్రింక్ తాగుతాం, ఇలా త్రాగడం వల్ల దాహం తీరదు సరి కదా శరీరం ఇంకాస్త నీటి శాతాన్ని కోల్పోతుంది.
కూల్ డ్రింక్‌లో ఉండే కెఫీన్ శాతం వల్ల రక్తపోటు అధికం అవుతుంది. ఇది సాధారణంగా శరీరనికి మనం తీసుకునే కప్పు కాఫీలో సరిపడినంత ఉంటుంది. అదే కూల్ డ్రింక్‌లో 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కూల్ డ్రింక్ తయారీలో ఉపయోగించే రసాయనాల వల్ల ఎముకలు సాంద్రత తగ్గిపోయి, త్వరగా ఎముకలు బలహీన పడతాయీ.
అలాగే దీనివల్ల పళ్ళుకూడా రంగు మారడం ఖాయం . ఇందులో ఉండే రసాయనాల వల్ల కిడ్నీ, లివర్ దెబ్బతింటాయి. దానిలోని గ్యాస్ అన్న వాహికమును నాశనం చేస్తాయి. కాబట్టి బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉంటే మానేయాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

