Kitchenvantalu

కరెంట్ షాక్ భయం లేకుండా.. జిడ్డు పట్టిన స్విచ్ బోర్డులను క్లీన్ చేసే సింపుల్ ట్రిక్స్

Switch Board Cleaning:నల్లగా, జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులను క్లీన్ చేయడం పెద్ద టాస్క్ లా అనిపిస్తుందా? అయితే ఈ బెస్ట్ హోమ్ హ్యాక్స్ మీ కోసమే. ఎక్కువ శ్రమపడకుండా, తక్కువ సమయంలో మురికి పట్టిన స్విచ్ బోర్డులను ఎలా శుభ్రం చేసుకోవచ్చో (Switch board cleaning tips in Telugu) ఈ ఆర్టికల్‌లో పంచుకుంటున్నాము. ఆ బెస్ట్ క్లీనింగ్ చిట్కాలు ఏమిటో ఇప్పుడే చదివి తెలుసుకోండి.

మురికి పట్టిన స్విచ్ బోర్డు ని ఇలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు..ప్రతి రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే లోపు మనం ఎన్నోసార్లు స్విచ్ బోర్డుని ఉపయోగిస్తాం. టీవీ లేదా ఫ్యాన్ లేదా బల్బు లేదా ట్యూబ్ లైట్ ఇలా వేటిని ఆన్ చేయాలన్న స్విచ్ బోర్డుని ఉపయోగించాలి.

దాంతో స్విచ్ బోర్డు చాలా తొందరగా మురికిగా మారుతుంది. ఈ మురికిని శుభ్రం చేయటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. స్విచ్ బోర్డు శుభ్రం చేయడానికి ముందు విద్యుత్తును డిస్ కనెక్ట్ చేయాలి.

అలాగే చేతులకు గ్లౌజులు కాళ్లకు చెప్పులు ధరించాలి. ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల వెనిగర్, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ క్లాత్ ముంచి బాగా పిండి స్విచ్ బోర్డును శుభ్రం చేయాలి.

ఒక బౌల్ లో మూడు టీ స్పూన్ల బేకింగ్ సోడాలో అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్విచ్ బోర్డు మీద అప్లై చేసి పొడి క్లాత్ తో తుడిచి బోర్డులు శుభ్రం చేయాలి. ఈ విధంగా చేయడం వలన నిమిషాల్లో మురికిని తొలగించి బోర్డు కొత్తదానిలా మెరుస్తుంది. స్విచ్ బోర్డు శుభ్రం చేసిన వెంటనే పవర్ ఆన్ చేయ కూడదు. స్విచ్ బోర్డ్ శుభ్రం చేసిన అరగంట తర్వాత మాత్రమే స్విచ్ ఆన్ చేయాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."