రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లకు భిన్నంగా రవ్వతో వేడి వేడి ‘లాలీపాప్స్’.. పిల్లలు అస్సలు వదిలిపెట్టరు!
Rava Lollipop: ఉదయం పూట ఎప్పుడూ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లు తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త వెరైటీగా, పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ‘రవ్వ లాలీపాప్స్’ (Rava Lollipops) ట్రై చేసి చూడండి. పేరు వినడానికే కాదు, తినడానికి కూడా ఇవి బయట కరకరలాడుతూ, లోపల సాఫ్ట్‌గా భలే రుచిగా ఉంటాయి.
వంట పెద్దగా రాని వారు కూడా చాలా తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే రవ్వ మరియు ఇతర సాధారణ పదార్థాలతోనే వేడి వేడిగా ఈ స్నాక్ కమ్ బ్రేక్‌ఫాస్ట్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా మాత్రమే కాకుండా, సాయంత్రం టీ టైమ్ స్నాక్స్‌గా లేదా పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకి కూడా ఇవి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.

మరి ఇంత కమ్మని మరియు క్రిస్పీ రవ్వ లాలీపాప్స్‌ను ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో చూసేద్దాం. ఈ వీకెండ్‌కి ఈ సరికొత్త రెసిపీని మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి!
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే, సాయంత్రం కాగానే స్నాక్స్ కావాలంటూ పట్టుబడుతారు. వారి కోసం టేస్టీగా వెరైటీగా రవ్వ లాలీ పప్ప్ తయారు చేద్దాం
కావాల్సిన పదార్ధాలు
బొంబాయి రవ్వ – 1/2కప్పు
బియ్యం పిండి – 1/2కప్పు
శనగపప్పు – కొద్దిగా
పచ్చిమిర్చి తరుగు – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
కొత్తిమీర – ½ టీ స్పూన్
జీలకర్ర- ½ టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
కరివేపాకు – ½ టీ స్పూన్
తయారీ విధానం
1.స్టౌ పై పాన్ పెట్టుకుని, రెండు కప్పుల నీటిని వేడి చేసి, అందులోకి ఉప్పు, పచ్చిమిర్చి వేసి, మూత పెట్టి,మరగనివ్వాలి.
2.మరుగుతున్న నీళ్లలో పచ్చిశగనపప్పు, బొంబాయి రవ్వ, బియ్యం పిండి, వేసి, ముద్దలు లేకుండా కలుపుకోవాలి.
3. రవ్వ ఉడికిన తర్వాత చిక్కగా మారుతుంది.
4. రవ్వను రెండు మూడు నిముషాలు లో ఫ్లేమ్లో ఉడికించి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
5. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని , అరచేతిలోక నూనె రాసుకుని, కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని బాల్స్ తయాలు చేసుకోవాలి.
6.ఇప్పుడు ఇడ్లీ పాత్రలోని, ప్లేట్స్ కు, నూనె రాసుకుని, అడుగున నీళ్లు వేసి, ఇడ్లీ ప్లేట్ లో తయారు చేసుకున్న బాల్స్ ను పెట్టుకోవాలి.
7.ఈ బాల్స్ ను పది నిముషాలు ఉడికించి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.ఇప్పుడు తాళింపు కోసం, స్టవ్ పై పాన్ పెట్టి, నూనె యాడ్ చేసుకుని, జీలకర్ర,ఆవాలు, కరివేపాకు వేసి, వేపుకోవాలి.
9. వేగిన తాళింపులో ఉడికించుకున్న రవ్వ బాల్స్ ను, కలుపుకుని, టూత్ పిక్ ను గిచ్చుకుని లాలీపప్ప్ ను సెర్వ్ చేసుకోవాలి.

