స్వీట్ షాప్ రుచితో కమ్మని మొక్కజొన్న లడ్డూలు.. ఇలా కొత్తగా, మృదువుగా తయారు చేయండి!
Corn Laddu Recipe: స్వీట్ తినాలనిపించినప్పుడు ఎప్పుడూ ఒకే రకమైన స్వీట్స్ చేసి బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త వెరైటీగా, ఎంతో ఆరోగ్యకరంగా ఉండే ‘మొక్కజొన్న లడ్డూ’ (Corn Laddu) తయారు చేసి చూడండి. సాధారణంగా మొక్కజొన్నలతో మనం గారెలు, స్వీట్ కార్న్ చాట్ లేదా సూప్ వంటివి చేసుకుంటాం.
కానీ వాటితో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే మృదువైన లడ్డూలను కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ కమ్మని లడ్డూలను పక్కా కొలతలతో, ఒక సరికొత్త పద్ధతిలో ఎలా చేయాలో ఈ బ్లాగ్ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం.
తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎంతో రుచిగా తయారు చేసుకునే ఈ కార్న్ లడ్డూల రెసిపీని చూసేయండి. పండగలకు లేదా సాయంత్రం వేళ స్నాక్ లాగా తినడానికి ఇది బెస్ట్ ఆప్షన్!
సత్తు ముద్దలు..పండుగల్లో స్పెషల్ గా చేసుకోని ప్రసాదంగా పెట్టుకునే మొక్క జొన్న పిండి ముద్దలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మొక్క జొన్ననలు – 2 కప్పులు
బెల్లం – 1 కప్పు
యాలకుల పొడి – కొద్దిగా
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని మొక్కజొన్న గింజలను మీడియం ఫ్లేమ్ పై దోరాగా వేపుకోవాలి.
2.వేపుకున్న మొక్కజొన్న గింజలను చల్లారినివ్వాలి.
3.చల్లారిన మొక్క జొన్నలను గ్రైండ్ చేసుకోవాలి.
4.ఇప్పుడు బెల్లం పాకం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి బెల్లం ½ కప్పు నీళ్లను వేసి కలుపుతు తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి.
5.ఇప్పుడు బెల్లం పాకంలోకి యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
6.అందులోకి కరిగిన 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి కలుపుకోవాలి.
7.నెయ్యి మిక్స్ అయ్యాక గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న పిండిని పాకంలో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోని కలుపుకోవాలి.
8.మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉండగానే లడ్డూలను చుట్టుకోవాలి.
9.బటర్ కాని నెయ్యి కాని అరచేతిలకు రాసుకోని లడ్డులను పగుల్లు లేకుండా చుట్టుకోవాలి.
10. అంతే కమ్మటి సత్తు పిండి ముద్దలు రెడీ.

