ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం, శ్లేష్మం కరిగించే మ్యాజిక్ డ్రింక్.. రోజుకు అర గ్లాస్ తాగితే చాలు!
Lungs Cleaning drink:పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా చాలా మంది ఊపిరితిత్తుల్లో కఫం, శ్లేష్మం పేరుకుపోయి తరచుగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల లంగ్ కెపాసిటీ తగ్గిపోయి కాస్త నడిచినా తొందరగా ఆయాసం రావడం, ఉబ్బసం, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి.
అయితే, మార్కెట్లో దొరికే మందులు వాడాల్సిన అవసరం లేకుండా.. మన వంటగదిలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసే ఒక డ్రింక్‌తో ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ కేవలం ‘అర గ్లాస్’ ఈ డ్రింక్ తాగితే ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం పూర్తిగా కరిగిపోయి, లంగ్ కెపాసిటీ అమాంతం పెరుగుతుంది.
ఊపిరితిత్తులను డీటాక్స్ (Detox) చేసే ఆ అద్భుతమైన డ్రింక్ ఏంటి? దాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి? ఎలా తాగాలి? అనే పూర్తి వివరాలను ఈ బ్లాగ్ పోస్ట్‌లో తెలుసుకుందాం. మీ శ్వాసకోశ వ్యవస్థను బలంగా, ఆరోగ్యంగా మార్చుకోవడానికి ఈ ఆర్టికల్ తప్పక చదివేయండి!
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. మనలో చాలా మంది చిన్న వయసులోనే ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమందికి కఫం, శ్లేష్మం వచ్చి ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లో కణజాలం కూడా దెబ్బతింటుంది.

లంగ్ కెపాసిటీని పెంచుకోవడం కోసం ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పొయ్యి వేలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి అరస్పూన్ అల్లం తురుము, అరస్పూన్ వాము, పది పుదీనా ఆకులు,పావు స్పూన్ అతిమధురం పొడి, ఆరు మిరియం గింజలను కచ్చా పచ్చాగా దంచి వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి.
ఈ కాషాయన్ని మరిగించి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా మూడు లేదా నాలుగు రోజుల పాటు తాగితే కఫం,శ్లేష్మం తొలగిపోయి ఊపిరితిత్తులు శుభ్రం అయ్యి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి శ్వాస సంబంద సమస్యలు తొలగిపోవాలంటే తప్పనిసరిగా ఈ డ్రింక్ తాగాలి.
అల్లంలో ఉన్న జింజీరాల్స్ ఊపిరితిత్తులలో గాలి గొట్టాల వెడల్పు పెంచి ఆక్సిజన్ రేటు పెరిగేలా చేస్తాయి. వాములో ఉన్న లక్షణాలు కూడా ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే పుదీనాలో ఉన్న లక్షణాలు వాపులను తగ్గిస్తుంది. అతిమధురంలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఇన్ ఫెక్షన్ తగ్గించటానికి సహాయపడతాయి.
మిరియాలలో ఉండే పెప్పరిన్ కూడా చాలా బాగా సహాయపడుతుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఈ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. అదే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడూ డాక్టర్ సలహాను పాటిస్తూ ఇప్పుడు చెప్పిన కషాయం తాగితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

