Healthhealth tips in telugu

మజ్జిగకు బదులు ఈ డ్రింక్ తాగండి.. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ 100% మీ సొంతం!

Immunity boosting drink : సాధారణంగా శరీరాన్ని చల్లబరచుకోవడానికి, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మనలో చాలామంది రోజూ మజ్జిగను తాగుతుంటారు. మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, మన శరీరానికి రోజువారీగా కావాల్సిన అన్ని రకాల పోషకాలు కేవలం దాని ద్వారానే అందవు.

అయితే, మజ్జిగకు ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే మరో అద్భుతమైన డ్రింక్ ఉంది. దీనిని తాగడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, క్యాల్షియం 100 శాతం అందడమే కాకుండా, ఎముకలు బలంగా తయారై రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.

ఇంతకీ ఆ హెల్తీ డ్రింక్ ఏంటి? దానిని ఎలా తయారు చేసుకోవాలి? రోజూ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అనే పూర్తి వివరాలను ఈ బ్లాగ్ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం. సంపూర్ణ ఆరోగ్యంతో, యాక్టివ్‌గా ఉండాలనుకునే వారు ఈ డ్రింక్ గురించి తప్పక చదివేయండి!

మన శరీరానికి అవసరమైన పోషకాలు అందాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే లస్సీ తాగితే మన శరీరానికి అవసరమైన పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటాం. లస్సీ తయారీ ఎలానో చూద్దాం. ముందుగా ఒక బౌల్ లో ఒక కప్పు జీడిపప్పు,ఒక కప్పు బాదం పప్పు వేసి నీటిని పోసి 5 గంటలు నానబెట్టాలి.
Diabetes patients eat almonds In Telugu
ఆ తర్వాత ఒక కప్పు ఖర్జూరం తీసుకొని దాని లోపల గింజలు తీసేయాలి. నానపెట్టిన బాదం పై తొక్క తీసి పక్కన పెట్టాలి.మిక్సీ జార్ లో తొక్క తీసిన బాదం పప్పు, నానిన జీడిపప్పు వేసి ఆ తర్వాత ఒక కప్పు కిస్ మిస్, ఒక కప్పు గింజలు తీసిన ఖర్జూరం వేసి మిక్సీ చేయాలి. ఈ పేస్టులో ఒక కప్పు పెరుగు వేసి మరల లస్సీ మాదిరిగా మిక్సీ చేయాలి.

ఇలా తయారైన మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకోవాలి. లస్సీలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ చాలా సహజసిద్ధమైనవి. అలాగే మనం దీనిలో బెల్లం లేదా పంచదార రెండింటిని వాడలేదు. వారంలో మూడు సార్లు తీసుకుంటూ ఉంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు.

అలాగే మెదడు చురుగ్గా పనిచేసి వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా చేస్తుంది. అంతే. కాకుండా calcium సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శారీరక మానసిక అలసట లేకుండా హుషారుగా ఉంటారు. రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడతారు.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ లస్సీని వారంలో రెండు సార్లు తాగితే సరిపోతుంది. ఏదైనా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఇటువంటి ఆహారాలను తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."