భరించలేని తలనొప్పి, మైగ్రేన్ వేధిస్తున్నాయా? ఈ చిన్న చిట్కాతో 5 నిమిషాల్లో ఉపశమనం!
Headache Home Remedies : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో తలనొప్పి (Headache), మైగ్రేన్ (Migraine) అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఒత్తిడి, నిద్రలేమి, వర్క్ టెన్షన్స్, లేదా వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఈ భరించలేని తలనొప్పికి చాలామంది వెంటనే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంటారు. కానీ, తరచుగా మందులు వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
అయితే, ఎలాంటి మందులు వాడకుండా.. కేవలం 5 నిమిషాల్లో ఎంతటి తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ అయినా సరే ఇట్టే తగ్గించే ఒక అద్భుతమైన న్యాచురల్ రెమెడీ మనకు అందుబాటులో ఉంది. తక్షణ ఉపశమనం (Instant Relief) కలిగించి, మెదడును రిలాక్స్ చేసే ఆ సింపుల్ ఇంటి చిట్కా ఏంటి?
దానిని ఎలా పాటించాలి? అనే పూర్తి వివరాలను ఈ బ్లాగ్ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం. తరచుగా తలనొప్పితో బాధపడేవారు ఈ ఎఫెక్టివ్ రెమెడీని తప్పక ట్రై చేయండి!
తలనొప్పి వచ్చిందంటే ఒక పట్టానా తగ్గదు. మనలో చాలామంది తలనొప్పి రాగానే షాప్ కి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నార్మల్ తలనొప్పి అయినా మైగ్రేన్ తలనొప్పి అయినా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.

పుదీనా టీ తాగితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని,గుప్పెడు పుదీనా ఆకులను వేసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి రుచి కోసం ఒక స్పూన్ తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ టీ తాగితే తలనొప్పి నుండి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
తులసి కూడా తలనొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది. తులసిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలనొప్పిని తగ్గించటంలో సహాయపడతాయి. నాలుగు తులసి ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగవచ్చు. తులసి ఆకుల నుండి రసాన్ని తీసి దానిలో తేనె కలిపి కూడా తీసుకోవచ్చు.
వాము కూడా నొప్పులను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వాములో థైమోల్ అనే రసాయనం ఉంటుంది. ఇది అనాల్జేసిక్‌గా పనిచేసి తలనొప్పి నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడూ కొంచెం వాము నోట్లో వేసుకొని నములుతూ ఆ రసాన్ని నిదానంగా మింగాలి. లేదంటే వాము కషాయం చేసుకొని తాగవచ్చు.
తలనొప్పి తక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పిన చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అదే తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మందులు వాడుతూ ఈ చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు చెప్పిన మూడు చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. మీ లభ్యతను బట్టి చిట్కాలను ఫాలో అవ్వండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

