Kitchenvantalu

నోట్లో వేసుకోగానే కరిగిపోయే ‘పనీర్ పాయసం’.. ఇంట్లోనే ఫ్రెష్‌గా ఇలా చేసి చూడండి!

Paneer Payasam Recipe: మన ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కొన్నిసార్లు పాలు విరిగిపోయినప్పుడు మనం వెంటనే పనీర్ చేస్తుంటాం. అయితే ఆ పనీర్‌తో ఎప్పుడూ కర్రీస్ లేదా స్నాక్స్ మాత్రమే కాకుండా, కొంచెం కొత్తగా.. ఎంతో రుచికరమైన ‘పనీర్ పాయసం’ (Paneer Kheer) ఎప్పుడైనా ట్రై చేశారా?

అచ్చం రసమలై రుచిని గుర్తుచేసే ఈ పాయసాన్ని చేయడం చాలా సులువు. తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే వాటితోనే అమృతం లాంటి పనీర్ పాయసాన్ని పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడే చూద్దాం.. మీ ఇంట్లో వాళ్ళు దీన్ని కచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు!

పాయసం అనగానే, రవ్వతోనో, సేమియా తోనో, లేక గోధుమ పిండితోనో చేసేస్తాం. కాని ఈసారి పన్నీర్ తో ట్రై చేద్దాం. చిటికెలో అయిపోతుంది. రుచి అదిరిపోతుంది.

కావాల్సిన పదార్ధాలు
పన్నీర్ – 200 గ్రాములు
పాలు – 750ML
పంచదార – 1/4కప్పు
యాలకుల పొడి – 1/2టీ స్పూన్
డ్రై ఫ్రూట్స్ – 3 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.స్టవ్ పై శుభ్రంగా ఉన్న, బాండీ పెట్టుకుని, చిక్కని పాలు పోసి , కలుపుతూ మరిగించుకోవాలి.
2. మరిగిన పాలల్లోకి, పంచదార వేసి మరికాసేపు మరిగించాలి.

3. పాలు చిక్కపడిన తర్వాత, వేడి నీళ్లలో నానపెట్టిన, తురిమిన పన్నీర్, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి,10 నిముషాలు మరగనివ్వాలి.
4. మరిగిన పన్నీర్ పాయసాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి, చల్లగా, లేదా వేడగా సెర్వ్ చేసుకుంటే, పన్నీర్ పాయసం రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."