చలికాలంలో పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా? ఈ నిజాలు తెలిస్తే అవాక్కవుతారు!
curd benefits In telugu :మన దైనందిన ఆహారంలో పెరుగుది ముఖ్యమైన స్థానం. అయితే, చలికాలం రాగానే పెరుగును చూసి భయపడేవాళ్లు చాలామంది ఉన్నారు. చలిలో పెరుగు తింటే కఫం పెరుగుతుందని, గొంతునొప్పి వస్తుందని ఒక అపోహ ఉంది.
కానీ, సరైన పద్ధతిలో, సరైన సమయంలో పెరుగును తీసుకుంటే చలికాలంలో కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సైన్స్ చెబుతోంది. అసలు చలికాలంలో పెరుగు తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఏంటి? ఏ సమయంలో తింటే మంచిది? ఇలాంటి నమ్మలేని నిజాలను ఇప్పుడు చూద్దాం.
ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంల కచ్చితంగా పెరుగు ఉండాలసిందే. భోజనం చివరిలో పెరుగు అన్నం తినకపోతే అన్నం తిన్నట్టుగా కూడా ఉండదు. అంతలా పెరుగు మన జీవితంలో బాగం అయిపోయింది. పెరుగులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయి.

మనలో కొంతమంది చలికాలం రాగానే పెరుగు తినటం మానేస్తూ ఉంటారు. చలికాలంలో పెరుగు తింటే జలుబు,దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయని భయపడతారు. అయితే నిపుణులు మాత్రం తప్పనిసరిగా చలికాలంలో పెరుగు తినాలని చెప్పుతున్నారు. ఎందుకంటే పెరుగు తింటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరిగి జలుబు,దగ్గు వంటి సమస్యల మీద పోరాటం చేసే శక్తి వస్తుందని నిపుణులు చెప్పుతున్నారు.
పెరుగులో రోగనిరోధక శక్తిని పెంచే ప్రోబైయటిక్స్ ,విటమిన్స్ ,పోటాషియం , క్యాల్షియం,మెగ్నీషియం , మరియు శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల బాక్టీరియను కల్గి ఉంటుంది. పెరుగులో ఉన్న పోషకాలు జీర్ణ సంబంద సమస్య అయినా మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం ఎముకలను, దంతాలను మరియు కండరాలను బలంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
పెరుగు పగటి సమయంలో తినటమే మంచిది. ఆస్తమా వ్యాధి ఉన్న వారు మాత్రం ఈ చలి కాలంలో రాత్రి వేళలో పెరుగు, మజ్జిగ వంటి వాటికి దూరంగానే ఉండాలి. పెరుగును క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడంవల్ల రక్తంలో కొవ్వు స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. దీనివల్ల హార్ట్ అటాక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తపోటును కూడా పెరుగు కంట్రోల్ చేస్తుంది.
చలికాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెట్టి తీసుకోవడం కంటే సాధారణంగా తీసుకోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిజ్ లో పెట్టుకున్న పెరుగును మాత్రం రాత్రి సమయంలో తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పెరుగును తీసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com
Eating curd in winter, చలికాలంలో పెరుగు తినొచ్చా, Winter health tips in Telugu, Myths and facts about curd, Ayurveda tips for winter, పెరుగు ప్రయోజనాలు, Telugu health tips.

