చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా? అయితే ఈ నాచురల్ టిప్స్ మీకోసమే!
White Hair Turn Black Home Remedies:మారుతున్న జీవనశైలి, తీవ్రమైన ఒత్తిడి, పోషక లోపం వల్ల ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘తెల్ల జుట్టు’ (Premature Greying). దీన్ని కవర్ చేయడానికి రకరకాల రసాయనాలతో కూడిన రంగులు వాడుతూ జుట్టు కుదుళ్లను మరింత దెబ్బతీస్తున్నారు.
అయితే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేద మరియు ఇంటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా, ఒత్తుగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జుట్టుకు పోషణను అందిస్తూ, తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టే ఆ అద్భుతమైన చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. దాంతో కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

కొబ్బరి నూనె,ఉసిరి రెండూ కూడా తెల్లజుట్టును నల్లగా మార్చటంలో చాలా బాగా సహాయపడతాయి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి 150 Ml కొబ్బరి నూనెను పోసి దానిలో 12 ఎండు ఉసిరికాయ ముక్కలను వేసి ముక్కలు బాగా ఉడికే వరకు మరిగించాలి. ఈ నూనె చల్లారక వడకట్టి ఓ గాజు సీసాలో నిల్వ చేయాలి.
ఈ నూనెను ప్రతి రోజు రాసుకుంటూ ఉంటె తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఎండిన ఉసిరి ముక్కలు మార్కెట్ లో లభ్యం అవుతాయి. లేదంటే ఉసిరికాయల సీజన్ లో కాయలను ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి.
తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టుకు అవసరమైన పోషణ కూడా లభిస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com
White hair to black hair tips in Telugu, తెల్ల జుట్టు నల్లగా మారాలంటే, Natural hair care tips Telugu, Premature greying home remedies, White hair remedies in Telugu, హెయిర్ కేర్ చిట్కాలు.

