Healthhealth tips in telugu

నెయ్యి తింటే లావు అవుతారని భయమా? ఈ నిజాలు తెలిస్తే రోజూ వదలకుండా తింటారు!

Ghee Benefits In telugu :మన భారతీయ వంటకాల్లో, ఆయుర్వేదంలో నెయ్యికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ‘నెయ్యి తింటే లావు అవుతాం’ అనే అపోహతో చాలామంది దీనిని తమ డైట్ నుండి పూర్తిగా తొలగిస్తున్నారు.

మీకు నెయ్యి తినే అలవాటు లేకపోతే.. మీరు శరీరానికి కావాల్సిన ఎన్నో ముఖ్యమైన పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతున్నట్లే. జీర్ణక్రియను మెరుగుపరచడం నుండి గుండె ఆరోగ్యాన్ని కాపాడటం వరకు.. రోజూ కాస్త నెయ్యి తీసుకుంటే కలిగే లాభాలు, నమ్మలేని నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం

ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితి కారణంగా మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతూ మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. మనలో చాలా మందికి సాధారణంగా ప్రతిరోజూ ఉదయం నిద్ర లేస్తూనే బెడ్ కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి టీ లేదా కాఫీ తాగందే పొద్దు గడవదు.
ghee benefits in telugu
నిజానికి ఉదయాన్నే కాఫీ, టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకు ప్రత్యామ్నాయంగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్‌ల నెయ్యి తాగితే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి.వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే నెయ్యి తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తారు.

కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే నెయ్యిలో ఉండే కొవ్వు పదార్థాలు మనకు మేలు చేస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి. ఉదయం పరగడుపున నెయ్యి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది.గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. నెయ్యి తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆకలి మందగించిన వారు ఉదయాన్నే పరగడుపున నెయ్యి తాగడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. అల్సర్‌తో బాధపడుతున్న వారు ఉదయాన్నే నెయ్యి తాగడం మంచిది. మారిన ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. నెయ్యిలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండుట వలన దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో పోరాటం చేయటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నెయ్యిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే జ్ఞాపక శక్తి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అయితే నెయ్యిని తగిన మోతాదులో తీసుకుంటేనే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు. నెయ్యి ఎక్కువగా తీసుకుంటే అనర్ధమే. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Health benefits of ghee, నెయ్యి ప్రయోజనాలు, Ghee in Ayurveda, Telugu health tips, Myths and facts about ghee, స్వచ్ఛమైన నెయ్యి ఉపయోగాలు, Daily diet tips.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."