Healthhealth tips in telugu

కళ్లజోడుతో పనే లేదు.. ఈ డ్రింక్ తాగితే కంటి శుక్లం, మసక చూపు పరార్!

Juice to Increase Eyesight :కంటి చూపు మసకబారడం, కళ్ల నుంచి నీళ్లు కారడం, లేదా కంటి శుక్లం (Cataracts) లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఖరీదైన మందులు, ఆపరేషన్ల గురించి ఆలోచించే ముందు మన ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే ఈ అద్భుతమైన డ్రింక్ గురించి తెలుసుకోండి.

రోజుకు కేవలం ఒక్క గ్లాసు తాగడం వల్ల కంటి నరాలు బలపడి, చూపు అమాంతం మెరుగుపడుతుంది. కంటి సమస్యలకు చెక్ పెట్టే ఆ పవర్‌ఫుల్ డ్రింక్ ఏమిటో, దాన్ని ఎలా తయారు చేయాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

క్యారెట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కంటికి సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. క్యారెట్ ని పచ్చిగాను తినవచ్చు. అలాగే జ్యూస్ చేసుకొని తాగవచ్చు. క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి వ్యాధులను తగ్గించటానికి సహాయపడుతుంది.
Carrot
క్యారెట్ తో జ్యూస్ ఎలా తయారుచేయాలో చూద్దాం. రెండు క్యారెట్లను తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత రెండు కమలాలను తొక్క తీసి తొనలుగా విడతీసి పైతొక్క తీసి ముత్యాలుగా తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఒక స్పూన్ అల్లం ముక్కలు,కమలా తొనల ముత్యాలను వేయాలి.

ఆ తర్వాత కట్ చేసిన క్యారెట్ ముక్కలు, ఒక కప్పు పండిన బొప్పాయి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ చేసుకొని వడకట్టి జ్యూస్ ని సపరేట్ చేయాలి. ఈ జ్యూస్ లో రెండు స్పూన్ల తేనె వేసి బాగా కలిపి తాగాలి. ఈ జ్యూస్ రక్షణ వ్యవస్థను ఏక్టివేట్ చేసే సూక్ష్మ పోషకాలు సమృద్దిగా ఉంటాయి.

క్యారెట్ లో బీటా కెరోటిన్‌ను శరీరం విటమిన్ ఎగా మారుస్తుంది. ఇది దృష్టిని మెరుగు పరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.క్యారెట్‌లలో జియాక్సంతిన్ మరియు లుటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కంటి నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. కంటి శుక్లం తగ్గించటంలో సహాయపడుతుంది. గ్లకోమా వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

అలాగే ఈ జ్యూస్ తాగటం వలన అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. ఉదయం తాగితే అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా హుషారుగా పనులు చేసుకోవటానికి అవసరమైన శక్తి లభిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన ఎముకల పెరుగుదల, అభివృద్ధి మరియు మరమ్మత్తు కోసం కూడా సహాయపడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

(how to improve eye vision naturally in telugu, eye sight improvement tips in telugu, home remedies for eye sight telugu, kanti chupu perugalante em cheyali, foods for healthy eyes telugu)

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."