Healthhealth tips in telugu

సీజనల్ వ్యాధులకు చెక్.. ఈ మ్యాజిక్ పౌడర్‌తో ఇమ్యూనిటీ డబుల్!

Pippali Health Benefits In Telugu : Pippallu లేదా Pippali లేదా Long Pepper అంటారు. వీటిలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఎక్కువగా ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. Pippallu ను వేగించి పొడిగా చేసుకొని సీసాలో నిల్వ చేసుకోవాలి.

వాతావరణం వేగంగా మారుతున్న ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ వంటి అనారోగ్య సమస్యలు సర్వసాధారణం. అయితే, మన వంటగదిలో సులభంగా దొరికే ఒక అద్భుతమైన పొడిని రోజూ కేవలం ‘చిటికెడు’ తీసుకుంటే.. మీ రోగనిరోధక శక్తి (Immunity) అమాంతం పెరగడమే కాకుండా ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.

అసలు ఆ మ్యాజిక్ పొడి ఏంటి? దాన్ని ఏయే పదార్థాలతో ఎలా తయారు చేసుకోవాలి? ఎప్పుడు, ఎలా తీసుకోవాలి? అన్న పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.
Pippali
ఒక స్పూన్ తేనెలో రెండు చిటికెల Pippallu పొడిని తీసుకుంటే ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. లేదంటే పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక రెండు చిటికెల పొడిని వేసి బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి తేనె కలిపి తాగవచ్చు. ఈ పొడి కొంచెం ఘాటుగా ఉంటుంది.

డయాబెటిస్ ఉన్నవారు ఈ పొడిని తీసుకుంటే ఈ పొడిలో ఉండే హైపోగ్లైసీమిక్ లక్షణం శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బీటా ప్యాంక్రియాటిక్ కణాల నుండి ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది. ఇది గ్లూకోజ్‌గా స్టార్చ్ విచ్ఛిన్నతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆ విధంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.

యాంటీ-వైరల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ ఫెక్షన్ నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిని వేదిస్తున్న అధిక బరువును తగ్గించటంలో సహాయపడుతుంది. శరీరాన్ని సమర్థవంతంగా నిర్విషీకరణ చేస్తుంది. ఆకలి వేయకుండా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఆస్తమా, బ్రోన్కైటిస్, దగ్గు మరియు జలుబు లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఊపిరితిత్తుల కణజాలాలను బలోపేతం చేయడానికి మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడటమే కాకుండా శ్వాసకోశం నుండి కఫం తొలగించటానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."