Healthhealth tips in telugu

వెయిట్ లాస్ + ఎనర్జీ.. బ్రేక్ ఫాస్ట్‌తో పాటు ఈ డ్రింక్ తీసుకుంటే నీరసం, అలసట మాయం!

Weight Loss Super Drink :డైట్ చేస్తున్నాం కదా అని బ్రేక్ ఫాస్ట్ మానేయడం లేదా తక్కువ తినడం వల్ల చాలామంది నీరసం, అలసటతో ఇబ్బంది పడుతుంటారు. కానీ, ఉదయం అల్పాహారంతో పాటు ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన పానీయాన్ని తీసుకోవడం వల్ల మీ బరువు తగ్గే ప్రయాణం చాలా సులభం అవుతుంది.

ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు (జీవక్రియ) పెరిగి కొవ్వు వేగంగా కరగడమే కాకుండా, రోజంతా మీకు కావాల్సిన శక్తి అందుతుంది. ఎటువంటి నీరసం లేకుండా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచే ఆ ‘ఎనర్జీ బూస్టింగ్ మరియు వెయిట్ లాస్’ డ్రింక్ ఏమిటి? దాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా డయాబెటిస్, గుండె సమస్యలు వంటి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. .
Weight Loss tips in telugu
అందుకే బరువు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా సహజ సిద్ధంగా మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి చాలా సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. .

అలాగే రోజంతా అలసట, నీరసం లేకుండా హుషారుగా ఉండవచ్చు. ఇప్పుడు చెప్పే డ్రింక్ ప్రతిరోజు ఉదయం తాగితే 15 రోజుల్లోనే తేడా గమనిస్తారు. ఒక బౌల్ లో ఆరు నల్ల ఎండు ద్రాక్ష, రెండు వాల్ నట్స్, రెండు అంజీర్, 4 బాదం పప్పులు, ఒక కప్పు నీటిని వేసి రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం నీటితో సహ డ్రై ఫ్రూట్స్ ని మిక్సీ జార్ లో వేసి మిక్సీ చేయాలి. బాదం పప్పును తొక్క తీసి వేయాలి.

ఆ తర్వాత ఒక కప్పు పాలు, గింజలు తీసిన మూడు ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మరోసారి గ్రైండ్ చేస్తే ఎంతో రుచికరమైన హెల్తీ డ్రింక్ సిద్ధమవుతుంది. ఈ డ్రింక్ ని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.

ఈ డ్రింక్ తాగటం వలన జీవ క్రియ రేటు పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. దాంతో వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా నీరసం, అలసట, నిస్సత్తువ వంటివి ఏమీ లేకుండా రోజంతా హుషారుగా చురుకుగా పనులు చేసుకుంటారు. మెదడు షార్ప్ గా తయారయ్యి మంచి ఆలోచనలు వస్తాయి. అంతేకాకుండా గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."