Healthhealth tips in telugu

వాము, జీలకర్ర కలిపి రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

Ajwain Jeera Tea : వాము మరియు జీలకర్ర కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా పొట్టలోని మొండి కొవ్వు కరుగుతుంది. గ్యాస్, అజీర్తి, బరువు తగ్గడానికి ఈ డ్రింక్ ఎలా ఉపయోగపడుతుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

వాము,జీలకర్ర రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ జీలకర్ర, అరస్పూన్ వాము వేసి రెండు గంటలు నానబెట్టి…ఆ తర్వాత పొయ్యి మీద పెట్టి 5 నిమిషాలు మరిగించాలి.

మరిగిన ఈ డ్రింక్ ని గ్లాసు లోకి వడకట్టి అరస్పూన్ తేనె కలిపి ఉదయం సమయంలో తాగాలి. ఈ డ్రింక్ ని పరగడుపున తాగవచ్చు…లేదంటే బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగవచ్చు. ఈ డ్రింక్ బరువు తగ్గటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. వాములో ఉండే థైమోల్ జీర్ణక్రియకు సహాయపడే గ్యాస్ట్రిక్ రసాలను కడుపులో విడుదల చేయడంలో సహాయపడుతుంది.

☛ Also Read: నోరూరించే ‘బీరకాయ ఉల్లికారం’ కూర.. ఇలా చేస్తే అన్నం మొత్తం దీనితోనే లాగించేస్తారు

☛ Also Read: పప్పులు నానబెట్టే పనిలేకుండా.. 10 నిమిషాల్లో అప్పటికప్పుడు వేసుకునే ‘క్రిస్పీ గోధుమ పిండి దోశ’!

వాములో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతాయి. జీవక్రియ బాగా జరిగితే చాలా తొందరగా బరువు తగ్గుతారు. జీలకర్ర జీర్ణక్రియ ఎంజైమ్‌లను విడుదల చేసి జీర్ణక్రియ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది.
అంతేకాక కడుపుకి సంబందించిన సమస్యలు అజీర్ణం, కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

రక్త ప్రసరణ బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ సీజన్ లో వచ్చే దగ్గు,గొంతునొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటిని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

ఈ సీజన్ లో కాస్త ఎక్కువగా నొప్పులు ఉంటాయి. వాటిని తగ్గించటానికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మన శరీరంలో హీమో గ్లోబిన్ శాతాన్ని పెంచుకోవటానికి కూడా ఈ డ్రింక్ సహాయపడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."