Healthhealth tips in telugu

ఈ సీజన్‌లో చిలకడదుంప ఎందుకు తినాలో తెలుసా? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!

sweet Potato Health benefits In Telugu : శీతాకాలంలో లభించే చిలకడదుంప (Sweet Potato) శరీరానికి అందించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి. రోగనిరోధక శక్తి, కంటి చూపు, జీర్ణక్రియ మెరుగుపరచడంలో ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ చదవండి.

ఈ సీజన్లో చిలకడ దుంపలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చిలకడ దుంపలు చాలా రుచికరంగా ఉంటాయి. చిలకడ దుంపలను ఉడికించి తీసుకోవచ్చు లేదా కాల్చి తీసుకోవచ్చు. ఈ దుంపలు చాలా తియ్యగా ఉంటాయి. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి.
sweet potato benefits
చిలకడ దుంపలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ A, C, మాంగనీస్, విటమిన్ B6, పొటాషియం, పాంటోథెనిక్ యాసిడ్, కాపర్ (రాగి), నియాసిన్ వంటివి సమృద్దిగా ఉంటాయి. దీనిలో బీటా కెరోటిన్ రూపంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. బీటా-కెరోటిన్ మీ శరీరంలో విటమిన్ ఎగా మార్చబడుతుంది. కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది.

☛ Also Read: నోరూరించే ‘బీరకాయ ఉల్లికారం’ కూర.. ఇలా చేస్తే అన్నం మొత్తం దీనితోనే లాగించేస్తారు

☛ Also Read: పప్పులు నానబెట్టే పనిలేకుండా.. 10 నిమిషాల్లో అప్పటికప్పుడు వేసుకునే ‘క్రిస్పీ గోధుమ పిండి దోశ’!

డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన పేగు ఆరోగ్యాన్ని మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనిలో ఫైటోస్టెరాల్‌ ఉండుట వలన జీర్ణవ్యవస్థకు సమస్యలు రాకుండా కాపాడుతుంది. గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. చిలకడ దుంపలలో ఉండే ఫైబర్స్ మరియు యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

అధిక స్థాయిలో ఆంథోసైనిన్ ఉండుట వలన కరోనరీ వ్యాధి అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది. అలాగే మెదడుకు ఎటువంటి సమస్యలు లేకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలు లేకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిలకడదుంపలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో కూడా సహాయపడుతుంది. చిలకడ దుంప తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వారంలో మూడు సార్లు తింటే సరిపోతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."