Beauty TipsHealthhealth tips in telugu

“కాఫీ పొడిలో ఇది ఒక్కటి కలిపి రాస్తే చాలు.. మొండి నల్లటి మచ్చలన్నీ పరార్!”

lemon and face glow tips:ముఖంపై మచ్చలు లేకుండా సహజమైన కాంతి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఎండ తీవ్రత వల్ల వచ్చే ట్యాన్, కాలుష్యం, మొటిమల తాలూకు నల్లని మచ్చలు ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిని పోగొట్టుకోవడానికి వేలకు వేలు ఖర్చు చేసి కెమికల్ క్రీములు వాడినా పెద్దగా ఫలితం ఉండదు, పైగా చర్మం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

అయితే వంటింట్లో ఉండే కాఫీ పొడితో చాలా సులభంగా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కాఫీ పొడిలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనికి తోడుగా తేనె లేదా పాలు వంటి సహజ పదార్థాలను కలిపి వాడినప్పుడు మొండి నల్ల మచ్చలు వేగంగా తగ్గిపోయి, ముఖం సహజంగా మెరిసిపోతుంది.

కాఫీ పొడితో ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారుచేయాలి? ఏ పదార్థాలు కలిపితే మంచి ఫలితం ఉంటుంది? సరైన విధానంలో ఎలా అప్లై చేయాలి? వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

కాఫీ పొడిలో ఇది కలిపి రాస్తే నల్లని మచ్చలు అన్నీ మాయం.. ఈ మధ్యకాలంలో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముఖం అందంగా, కాంతివంతంగా మెరవాలని కోరు కుంటున్నారు. అలా కోరుకోవడం సహజమే. దీనికోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకొద్ది డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు.

అలా కాకుండా ఇంటి చిట్కాలతో చాలా ఈజీగా ముఖం మీద నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ అన్నింటిని తొలగించుకోవచ్చు.ఒక బౌల్ లో అరస్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ కాఫీపొడి, రెండు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద నిమ్మచెక్కతో స్క్రబ్ చేస్తూ అప్లై చేసుకోవాలి.

ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే. ముఖం మీద నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి తెల్లగా మెరిసిపోతుంది. బేకింగ్ సోడా పడని వారు ENO వాడవచ్చు. అలాగే నిమ్మరసం పడని వారు టమోటా రసం ఉపయోగించవచ్చు.

ఈ మిశ్రమాన్ని మెడ, కాళ్లు, చేతులు నల్లగా ఉన్న ప్రాంతాల్లో కూడా రాయవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త సమయాన్ని కేటాయించి శ్రద్ద పెడితే చాలు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."