“షాంపూలో నిమ్మరసం, టీ డికాక్షన్ కలిపి వాడండి.. చుండ్రు మాయమై జుట్టు ఒత్తుగా పెరుగుతుంది!”
Lemon and tea for hair: చుండ్రు (Dandruff), స్కాల్ప్ దురద, జిడ్డుతనం ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సాధారణ సమస్యలు. చుండ్రు మొదలైందంటే వెంట్రుకల కుదుళ్లు బలహీనపడి విపరీతంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.
దీనిని తగ్గించడానికి మార్కెట్లో దొరికే రకరకాల యాంటీ-డాండ్రఫ్ షాంపూలను ఆశ్రయిస్తుంటారు. కానీ వాటిలోని అధిక రసాయనాలు స్కాల్ప్‌ను మరింత పొడిగా మార్చేస్తాయి, కొద్దిరోజుల తర్వాత చుండ్రు మళ్లీ వస్తుంది.
అయితే మీ రెగ్యులర్ షాంపూలోనే వంటింట్లో సహజంగా లభించే నిమ్మరసం, టీ డికాక్షన్ కలిపి వాడితే చుండ్రు సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్, విటమిన్ ‘సి’ స్కాల్ప్ యొక్క పి.హెచ్ (pH) స్థాయిని సమతుల్యం చేసి, చుండ్రు కలిగించే ఫంగస్‌ను నశింపజేస్తాయి.
అదే సమయంలో టీ డికాక్షన్‌లోని యాంటీఆక్సిడెంట్లు మరియు కెఫీన్ రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా, మెరుస్తూ పెరుగుతుంది.
ఈ మిశ్రమాన్ని సరైన నిష్పత్తిలో ఎలా తయారుచేసుకోవాలి? వారానికి ఎన్నిసార్లు ఉపయోగించాలి? జుట్టు త్వరగా పెరగడానికి పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా చూద్దాం.
జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య, జుట్టు చివర్లు చిట్లడం, జుట్టు చిట్లిపోవటం వంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. ఆడవారి కాకుండా మగవారు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు.

పొడవైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. టీ డికాషన్ జుట్టు సమస్యల పరిష్కారానికి చాలా బాగా సహాయపడుతుంది.జుట్టు రాలే సమస్యను ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో టీ డికాషన్ చాలా బాగా సహాయపడుతుంది.
టీ ఒక అద్భుతమైన టోనర్ గా చెప్పవచ్చు.ఒక గిన్నెలో 2గ్లాసుల నీటిని పోసి స్పూన్ న్నర టీ పొడి వేసి బాగా మరిగించి ఆ నీళ్లు బాగా మరిగాక ఆ నీటిని వడగట్టి నిమ్మరసం ఒక స్పూన్ వెయ్యాలి.
దీనిలో మనం రెగ్యులర్ గా వాడే షాంపూనూ వేయాలి. ఈ మూడు పదార్థాలు బాగా కలిసేలా కలపాలి ఇందులో వాడిన నిమ్మరసం జుట్టులో ఉన్న జిడ్డును తొలగించడానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయటానికి సహాయపడి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.
ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి అరగంటయ్యాక సాధారణమైన నీటితో తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు రెండు నెలలపాటు చేస్తే జుట్టు దృఢంగా పెరగడమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది. ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

