10 నిమిషాల్లో ఇమ్యూనిటీ పెంచే ‘గార్లిక్ రైస్’.. ఇలా సులువుగా చేసేయండి!
Garlic Rice:ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేయడానికి సమయం దొరకడం లేదా? అయితే కేవలం 10 నిమిషాల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ‘గార్లిక్ రైస్’ (వెల్లుల్లి రైస్) ట్రై చేయండి. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని (Immunity) పెంచడమే కాకుండా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయి.
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వంట చేసే ఓపిక లేనప్పుడు.. అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకునే ఈ రైస్ అద్భుతంగా ఉంటుంది. ఘాటైన వెల్లుల్లి ఫ్లేవర్‌తో ఉండే ఈ రైస్ పిల్లల లంచ్ బాక్స్‌లోకి కూడా బెస్ట్ ఆప్షన్. మరి ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్‌గా, టేస్టీగా గార్లిక్ రైస్ ఎలా చేయాలో ఈ పోస్ట్‌లో చూద్దాం!
కేవలం 10 నిమిషాల్లో రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి రైస్..చాలా సింపుల్ గా చేసేయండి.. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యంతో పాటు రుచిగా కూడా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
సోనామసూరి బియ్యం- 100గ్రా.,ఆవాలు రెండు టీ స్పూన్లు,శనగపప్పు పది గ్రా,పచ్చిమిర్చి- ఆరు,వెల్లుల్లి-100గ్రా (రేకులను విడదీసి హిట్టు ఒలుచుకోవాలి), కరివేపాకు-50గా, నెయ్యి 50గ్రా,నిమ్మచెక్క ఒకటి,ఎండుమిర్చి రెండు,ఉప్పు తగినంత
తయారు చేయు విధానం
అన్నాన్ని పలుకుగా వండి వెడల్పు పాత్రలో వేసి చల్లారనివ్వాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి కొంత కరివేపాకును వేయించి పక్కన పెట్టాలి. మిగిలిన నేతిలో ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులో వెల్లుల్లి రేకులు వేసి సన్నమంట మీద కొద్ది సెకన్ల పాటు వేగనివ్వాలి.ఇప్పుడు ఉప్పు, అన్నం కలిపి దించేయాలి. చివరగా నిమ్మరసం కలిపి, నేతిలో వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేయాలి.

