Kitchenvantalu

ఇన్ స్టంట్ టమాటా దోశ.. పిండి పులియబెట్టే పనిలేకుండా పది నిమిషాల్లో రెడీ!

Tomato Dosa: రోజూ తినే రొటీన్ దోశలు బోర్ కొట్టాయా? అయితే ఉదయం పూట హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకోగలిగే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ‘టమాటా దోశ’. పిండి పులియబెట్టే పని లేకుండా కేవలం పది నిమిషాల్లోనే కరకరలాడే దోశలను ఈజీగా వేసుకోవచ్చు.

పుల్లపుల్లగా, కాస్త కారంకారంగా ఉండే ఈ దోశలకు ప్రత్యేకంగా చట్నీ కూడా అవసరం లేదు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చల్లి వేడివేడిగా వడ్డిస్తే.. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, కమ్మటి టమాటా దోశను పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో ఈ పోస్ట్‌లో చూద్దాం!

టమోటా దోశ ఇలా చేస్తే వదలకుండా తినేస్తారు..దోశెలంటే ఎంతో మందికి ప్రాణం. కానీ ఎప్పుడూ ఒకేలా వేసుకుని తింటే బోరు కొట్టడం లేదా? అందుకే కాస్త కొత్తగా ప్రయత్నించండి. టమోటాలతో దోశె వేసుకుని చూడండి. పిల్లలు వదలకుండా తినేస్తారు. వీటిని చేయడం పెద్ద కష్టమేం కాదు. సింపుల్‌గా చేయవచ్చు.

కావలసిన పదార్ధాలు
బియ్యం 250 గ్రాములు
టమాటాలు 3
సెనగ పప్పు 2 టేబుల్ స్పూన్స్
చింతపండు కొద్దిగా
ఎండు మిరపకాయలు 6
ఉప్పు తగినంత
నువ్వుల నూనె 100 మి.లీ

తయారి విధానం
బియ్యం మరియు శనగపప్పు 2 గంటలు నానపెట్టండి.తరువాత ఉప్పు, ఎండు మిరపకాయలు, టమాటాలు మరియు చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.దోశల పెనం వేడి చేసి, రుబ్బుకున్న మిశ్రమాన్ని అంచులనుంచి మధ్యలోకి వెయ్యండి. కొద్దిగా నూనె తీసుకొని దోశ మీద చల్లి, ఎర్రగా కాలేవరకు ఉంచండి. ఇదేవిధంగా రెండు వైపులా కాల నివ్వాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."