Healthhealth tips in telugu

ప్రతిరోజూ అల్లం తింటున్నారా? ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదు!

Ginger Tips In Telugu : ప్రతి రోజు అల్లం తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా.. కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో తెలుసా? అల్లం వల్ల కలిగే లాభాలతో పాటు, ఎవరెవరు దీన్ని దూరంగా ఉంచాలో పూర్తి వివరాల కోసం ఇప్పుడే చదవండి!

అల్లంలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటానికి మరియు సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు అల్లం తినకుండా ఉంటేనే మంచిదని నిపుణులు అంటున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
Ginger benefits in telugu
జీర్ణ రసాలను నియంత్రించి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేయటమే కాకుండా ఆకలిని నియంత్రించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అయితే పొట్టిగా బరువు తక్కువగా ఉన్నవారిలో బాడీ మాస్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వారి శరీరంలో విటమిన్ల లోపం కనపడుతుంది. అలాంటి వారు అల్లం తినకూడదు.

Haemophilia సమస్య ఉన్నవారు అల్లం తినకూడదు. ఎందుకంటే శరీరం నుండి అధిక రక్తస్రావం జరిగితే, రక్తం గడ్డకట్టడం అవసరం. అల్లం సాధారణంగా శరీరంలో రక్త ప్రసరణను ఉత్తేజపరిచేందుకు ఉపయోగిస్తారు. అయితే Haemophilia సమస్య ఉన్నవారు అల్లం తినడం వల్ల శరీరంలో అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.

గర్భధారణ సమయంలో ముఖ్యంగా చివరి త్రైమాసికంలో, అల్లం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఇది premature delivery మరియు తీవ్రమైన కడుపు నొప్పికి దారితీస్తుంది. డయాబెటిస్,రక్తపోటు కోసం మందులు వాడేవారు తక్కువ మోతాదులో మాత్రమే అల్లంను తీసుకోవాలి. అల్లంను ఎక్కువగా తీసుకుంటే రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది.

అల్లం తినకూడని వారు దానికి బదులుగా ఏమి తీసుకోవాలనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. శరీరంలో జీర్ణక్రియ బాగా జరగాలంటే అల్లంకు బదులుగా మిరియాలను తీసుకోవచ్చు. సమస్యలు ఉన్నప్పుడూ ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకొని తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."