Beauty TipsHealthhealth tips in telugu

జుట్టు రాలిపోతోందని బాధపడుతున్నారా? ఇలా చేస్తే ఊడిన చోటే గుత్తులు గుత్తులుగా కొత్త జుట్టు వస్తుంది!

Hair Fall Tips:జుట్టు రాలడం (Hair Fall) అనేది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య. తలస్నానం చేసినప్పుడు, దువ్వెన పట్టుకున్నప్పుడు గుప్పెడు జుట్టు ఊడిపోతుంటే.. ఎక్కడ బట్టతల వచ్చేస్తుందోనని భయపడుతున్నారా? మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, నూనెలు వాడి విసిగిపోయారా?

అయితే మీకోసం ఒక అద్భుతమైన న్యాచురల్ రెమెడీ ఇక్కడ ఉంది. ఈ సింపుల్ ఇంటి చిట్కాను పాటిస్తే, మీ జుట్టు రాలడం వెంటనే తగ్గడమే కాకుండా.. ఒక్క వెంట్రుక ఊడిన చోట 20 కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తాయి. అవును, కుదుళ్లకు సరైన పోషణ అందించి, నిర్జీవమైన కేశాలకు జీవం పోసే ఈ పవర్‌ఫుల్ చిట్కా తయారీ విధానం చాలా సులభం.

జుట్టును ఒత్తుగా, పొడవుగా, నల్లగా మార్చే ఆ సీక్రెట్ రెమెడీ ఏంటి? దాన్ని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలి? వారానికి ఎన్నిసార్లు వాడాలి? అనే పూర్తి వివరాలను ఈ బ్లాగ్ పోస్ట్‌లో తెలుసుకోండి. ఇక జుట్టు రాలుతుందనే టెన్షన్ మర్చిపోయి, అందమైన కురులను మీ సొంతం చేసుకోండి!

ఇలా చేస్తే చాలు…ఊడిన జుట్టు దగ్గర 20 కొత్త వెంట్రుకలు వస్తాయి.. ఈ సీజన్ లో జుట్టుకి సంబందించిన ఎన్నో రకాల సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకుంటే చాలా సులభంగా సమస్యల నుండి బయట పడవచ్చు. ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు చాలామంది భయపడతారు.

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒకవేళ ప్రయోజనం ఉన్నా తాత్కాలికమే. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. .

సహజమైన ఉత్పత్తులతో మన ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రెమిడీ కోసం రెండే రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఈ రెమిడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక గిన్నెలో నీటిని పోసి ఒక స్పూన్ ఉసిరి పొడి వేసి బాగా మరిగించాలి.

ఈ నీటిని చల్లారబెట్టాలి. ఆ తర్వాత అర చెక్క నిమ్మరసం,మనం రెగ్యులర్ గా వాడే షాంపూ కలపాలి. ఈ నీటిని తలకు బాగా పట్టించి రుద్దాలి. అప్పుడు తలలో ఉన్న దుమ్ము, ధూళి తొలగిపోవటమే కాకుండా జుట్టు కుదుళ్లకు పోషణ అంది జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

ఉసిరిలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే తెల్లజుట్టు నల్లగా మారటానికి కూడా సహాయపడుతుంది. కాస్త ఓపికగా ఈ రెమిడీ ఫాలో అయితే చుండ్రు వంటి అన్నీ రకాల జుట్టుకి సంబందించిన సమస్యలు తొలగిపోతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."