Beauty TipsHealthhealth tips in telugu

ఖరీదైన క్రీమ్స్ తో పనిలేదు.. పింపుల్స్, మచ్చలను శాశ్వతంగా పోగొట్టే ‘మునగాకు’ ఫేస్ ప్యాక్!

Moringa For Pimples: ముఖంపై వచ్చే మొటిమలు (Pimples), అవి తగ్గాక మిగిలిపోయే నల్లటి మచ్చలు చాలామందిని మానసికంగా కుంగదీస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీమ్స్, లోషన్స్ వాడి విసిగిపోయారా? అయితే వాటికి గుడ్ బై చెప్పేసి, మన పెరట్లో సులభంగా దొరికే ‘మునగాకు’ (Moringa) వైపు దృష్టి సారించండి.

మునగాకులో ఉండే అద్భుతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను సమూలంగా నాశనం చేస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేసి, వయసు పైబడటం వల్ల వచ్చే ముడతలు, డార్క్ స్పాట్స్ ను మాయం చేస్తాయి. అసలు ముఖ సౌందర్యానికి ఈ మునగాకును ఎలా వాడాలి?

మునగాకు ఫేస్ ప్యాక్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? ఎలాంటి చర్మం (Skin type) ఉన్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుందో ఈ బ్లాగ్ పోస్ట్ లో వివరంగా తెలుసుకుందాం. మచ్చల్లేని మెరిసే చర్మం కోసం ఈ న్యాచురల్ బ్యూటీ సీక్రెట్ ను అస్సలు మిస్ అవ్వకండి!

మన చుట్టూ ఉన్న ఎన్నో రకాల మొక్కలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి. అలాంటి మొక్కలలో మునగ చెట్టు కూడా ఒకటి. మునగ చెట్టులోని ప్రతి బాగం మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది.

ముఖం మీద మొటిమలు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొటిమలను తగ్గించుకోవటానికి రకరకాల ఫేస్ క్రీమ్స్ వాడుతూ ఉంటాం. చాలా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అలా ఖర్చు పెట్టకుండా ఇంటి చిట్కాలతో మొటిమల నుండి బయట పడవచ్చు. ముఖం ఎంత అందంగా ఉన్నా మొటిమలు వచ్చాయంటే అందవిహీనంగా కనబడుతారు.

మొటిమలు అనేవి యుక్తవయసులో సహజమే. అలా కాకుండా వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మొటిమలు వస్తే ఇంటి చిట్కాలు సహాయపడతాయి. మునగాకు మొటిమలను తగ్గించడంలోనూ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మనం వంటల్లో వాడుతూ ఉంటాం. ఎన్నో పోషకాలు ఉంటాయి.

ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, విటమిన్ ఎ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. మునగాకు మొటిమలను తగ్గించటమే కాకుండా ముఖం కాంతివంతంగా మెరవడానికి సహాయపడుతుంది. దీని కోసం ఒక ప్యాక్ తయారు చేసుకోవాలి. మునగాకు నుండి రసాన్ని తీసుకొని దానిలో నిమ్మరసం కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి పదినిమిషాలయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా మూడు రోజులపాటు చేస్తే మొటిమలు మాయమైపోతాయి. ముఖం కాంతివంతంగా మారాలి అంటే మునగాకు పేస్ట్ లో తేనె కలిపి ముఖానికి రాయాలి. బాగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు అన్నీ పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."