సమయం, డబ్బు ఆదా.. ప్రతి ఇల్లాలు తప్పక తెలుసుకోవాల్సిన సూపర్ కిచెన్ టిప్స్!
Kitchen Tips and tricks In Telugu: ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మహిళలకు వంటగదిలోనే సగం సమయం గడిచిపోతుంది. హడావిడిగా వంట చేయడం, కూరగాయలు తరగడం, పాలు పొంగిపోకుండా చూసుకోవడం.. ఇలా కిచెన్‌లో ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది.
అయితే కొన్ని స్మార్ట్ కిచెన్ టిప్స్ (Kitchen Tips) తెలిస్తే మీ వంటగది పనులు చాలా సులభంగా, వేగంగా పూర్తవుతాయి. పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలన్నా, కూరలో పొరపాటున ఉప్పు లేదా కారం ఎక్కువైతే దాన్ని వెంటనే ఎలా సరిచేయాలో తెలియకపోయినా, ఫ్రిడ్జ్‌లో పెట్టిన కూరగాయలు, ఆకుకూరలు త్వరగా వాడిపోకుండా రోజుల తరబడి ఫ్రెష్‌గా ఉండాలన్నా కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే సరిపోతుంది.
వంట చేయడం విసుగు పుట్టించే పనిలా కాకుండా, ఆస్వాదిస్తూ చేసేలా మార్చే ఆ అద్భుతమైన కిచెన్ హాక్స్ ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం. ఈ చిన్న పద్ధతులు పాటిస్తే వంటగదిలో మీ శ్రమ సగానికి పైగా తగ్గడమే కాకుండా, మీ సమయం కూడా ఎంతో ఆదా అవుతుంది!
ప్రతి ఇల్లాలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన వంటింటి చిట్కాలు..వంటింటిలో కొన్ని చిట్కాలను ఫాలో అయితే వంట తొందరగా అవ్వటమే కాకుండా రుచిగా వస్తుంది. అంతేకాకుండా సమయం కూడా అదా అవుతుంది. అలాగే ఈ చిట్కాలను పాటించటం కూడా చాలా సులువు.
కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగా ఉంటుంది.
పాలలో జున్ను తీసేటప్పుడు పైన నీరు పారపొయ్యకుండా పిండిలో కలుపుకోవచ్చు. లేదా కూరల్లో వేస్తే కూర రుచిగా ఉంటుంది.
పాపడ్లు మొదలైనవి వేయించే ముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగకుండా ఉంటుంది.
మైదా పిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళాదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడతాయి.
వెల్లుల్లితో కలిపి బంగాళాదుంపలు ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి.
బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండువైపులా తొడిమెలు తీసేసి ప్లాస్టిక్ కవర్ లో వేసి ఫ్రిజ్లో ఉంచాలి.
ఇడ్లీ, దోశ చేసేటప్పుడు బియ్యం కొద్దిసేపు వేయించి నానబెడితే ఇడ్లీ మెత్తగా, దోశ కరకరలాడుతూ ఉంటుంది.
దంచిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డబ్బాలో కొద్దిగా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి.

