నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే ‘రవ్వ కేసరి’.. ఈ పక్కా కొలతలతో చేస్తే 10 నిమిషాల్లో రెడీ!
Rava Kesari: ఇంట్లో ఏదైనా పండుగ వచ్చినా, పూజలు జరిగినా దేవుడికి నైవేద్యం పెట్టడానికి మనకు ముందుగా గుర్తొచ్చే స్వీట్ ‘రవ్వ కేసరి’. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు లేదా అప్పటికప్పుడు తీపి తినాలనిపించినప్పుడు తక్కువ సమయంలో ఎంతో సులభంగా చేసుకునే రెసిపీ ఇది.
అయితే, చాలామందికి రవ్వ కేసరి చేసేటప్పుడు ఉండలు కట్టడమో లేదా చల్లారాక మరీ గట్టిగా అయిపోవడమో జరుగుతుంది. కానీ, సరైన కొలతలతో చేస్తే.. నోట్లో వేసుకోగానే కరిగిపోయే కమ్మని రవ్వ కేసరి కేవలం 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇంతకీ ఆ పక్కా కొలతలు ఏంటి? ఈ స్వీట్‌ను హోటల్ స్టైల్‌లో పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఏ పూజకైనా,పండుగకైనా,శుభకార్యానికైనా ముందుగా కనిపించే స్వీట్ ప్రసాదం రవ్వ కేసరి. ఇంట్లో ఉండే ఐటమ్స్ తో ఈజీగా చేసుకునే రవ్వకేసరి.. రవ్వకేసరి ఎలా తయారు చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
బొంబాయ్ రవ్వ – 1 కప్పు
పంచదార – 1.5 కప్పు
నెయ్యి – ¾ కప్పు
వేడినీళ్లు – 3 కప్పులు
జీడిపప్పులు – 15
కిస్మిస్ – 15
యాలకుల పొడి – ¼ టీ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని సగం నెయ్యి వేసి అందులోకి జీడిపప్పులు,కిస్మిస్ లు ,రవ్వ వేసి సన్నని సెగ పై దోరగా వేపుకోవాలి.
2.వేగిన రవ్వలో వేడి నీళ్లు పోసి రవ్వని దగ్గర పడనివ్వాలి.
3.రవ్వ మెత్తగా ఉడుకుతున్నన సమయంలో పంచదార వేసి మరింత దగ్గరికి ఉడకనివ్వాలి.
4.దగ్గర పడ్డ రవ్వలో ఎల్లో ఫుడ్ కలర్ ,యాలకుల పొడి,మిగిలిన నెయ్యి,వేసి కలిపి నెయ్యి పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ పై ఉడకనివ్వాలి.
5.అంతే ఘుమ ఘుమలాడే రవ్వ కేసరి తయారైనట్టే.

