Healthhealth tips in telugu

స్లీపింగ్ పిల్స్ అవసరమే లేదు.. ఈ స్పెషల్ టీని ఇలా తీసుకుంటే జీవితంలో నిద్రలేమి సమస్యే ఉండదు!

Herbal tea For Sleep In Telugu : ఉరుకులు పరుగుల జీవితం, పని ఒత్తిడి, ఎక్కువసేపు మొబైల్స్ లేదా ల్యాప్‌టాప్స్ చూడటం వల్ల ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘నిద్రలేమి’ (Insomnia). రాత్రంతా బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతున్నా నిద్రపట్టక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.

దీనికోసం రోజూ స్లీపింగ్ పిల్స్ (నిద్రమాత్రలు) వాడటం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. అయితే, ఎటువంటి మందులు లేకుండా మన వంటగదిలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసుకునే ఒక అద్భుతమైన టీతో ఈ నిద్రలేమి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.

రాత్రి పడుకునే అరగంట ముందు ఈ స్పెషల్ టీని తీసుకుంటే.. నాడీ వ్యవస్థ శాంతించి, మెదడులోని ఒత్తిడి తగ్గి, క్షణాల్లో గాఢమైన నిద్ర పడుతుంది. ఇంతకీ మ్యాజిక్‌లా పనిచేసే ఆ టీ ఏంటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఈ మధ్య కాలంలో రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర రావడం లేదని చెప్పే వారు చాలా మంది కనబడుతున్నారు. ఆహార అలవాట్లు, ధూమపానం, మద్యపానం, రాత్రి సమయంలో టీవీ, స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడపడం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో నిద్ర సరిగా పట్టక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.
Drumstick leaves Health Benefits
సరైన నిద్ర లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. ఇప్పుడు చెప్పే టీ తీసుకుంటే నిద్ర చాలా బాగా పడుతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడెక్కాక గుప్పెడు మునగాకు, పావు స్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి, అంగుళం అల్లం ముక్కను దంచి వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత ఈ టీ ని వడగట్టి తేనె కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. రాత్రి పడుకోవడానికి గంట ముందు తాగితే ఈ టీలో ఉన్న లక్షణాలు మంచి నిద్ర పట్టడానికి సహాయపడతాయి. అలాగే ఈ టీ తాగటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయ్యి సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను కూడా తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పని చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు ఉన్నా సరిగా నిద్ర పట్టదు. మునగ ఆకులో ఉండే లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచి మంచి నిద్రకు సహాయపడుతుంది.

మునగ ఆకులు సంవత్సరం పొడవునా లభ్యం అవుతాయి. ఈ టీ తాగటం వలన నిద్రలేమి సమస్య తగ్గటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కాస్త ఓపిక చేసుకొని ఇలా చిట్కాలను పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."