పిల్లల జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే మ్యాజికల్ డ్రింక్.. రోజుకు ఒక గ్లాసు చాలు!
Apple cucumber and carrot juice benefits : నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు చదువులోనూ, ఇతర యాక్టివిటీస్‌లోనూ ముందుండాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఎదుగుదల కూడా చాలా ముఖ్యం. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చదివింది సరిగ్గా గుర్తుండటం లేదనో, ఏకాగ్రత తక్కువగా ఉందనో బాధపడుతుంటారు.
అయితే బయట దొరికే కెమికల్స్ ఉన్న పౌడర్ల కంటే, మన ఇంట్లో ఉండే సహజమైన పదార్థాలతోనే పిల్లల బ్రెయిన్ పవర్‌ను పెంచవచ్చు. రోజుకు కేవలం ఒక్క గ్లాసు ఈ పోషకాల పానీయం తాగిస్తే చాలు.. పిల్లల మెదడు చురుగ్గా మారి, వారి జ్ఞాపకశక్తి మరియు ఆలోచనా శక్తి రెట్టింపు అవుతుంది. మరి ఆ మ్యాజికల్ డ్రింక్ ఏంటో, దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!
పిల్లల ఎదుగుదలకు ఎన్ని పోషకాలను అందిస్తామో…అలాగే పిల్లల మెదడును చురుగ్గా ఉంచే ఆహారాలను ఇవ్వటానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లల మెదడు చురుకుగా ఉంటే జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా అన్నింటిలోనూ బాగా రాణిస్తారు.

అందువల్ల పిల్లల మెదడు చురుగ్గా ఉండటానికి కొన్ని ఆహారాలను వారి డైట్ లో తప్పనిసరిగా చేర్చాలి. పిల్లల మెదడు చురుగ్గా ఉండటానికి ఒక జ్యూస్ తయారు చేసుకుందాం. ఈ జ్యూస్ కోసం ఒక క్యారెట్, ఒక కీరదోసకాయ, ఒక యాపిల్ శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
క్యారెట్ ముక్కలను మాత్రం ఉడికించాలి. మిక్సీ జార్ లో ఉడికించిన క్యారెట్ ముక్కలు, కీరదోస ముక్కలు, యాపిల్ ముక్కలు, పది నుంచి 12 పుదీనా ఆకులు,చిన్న అల్లం ముక్క, ఒక గ్లాసు నీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రుచికి సరిపడా తేనెను కలపాలి. ఈ జ్యూస్ ను బ్రేక్ ఫాస్ట్ చేయటానికి గంట ముందు పిల్లలకు ఇవ్వాలి.
ఈ విధంగా వారంలో రెండుసార్లు ఈ జ్యూస్ ఇస్తూ ఉంటే వీటిలో ఉన్న పోషకాలు పిల్లల మెదడును చురుగ్గా చేసి జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తిని రెట్టింపు చేస్తాయి. అలాగే కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
ఈ జ్యూస్ ని ఉదయం సమయంలో తాగటం వలన అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. రక్తహీనత సమస్య ఉన్న వారిలో రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి మరియు రక్తకణాల పెరుగుదలకు సహాయపడి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. మలబద్దకం సమస్య ఉన్నవారికి కూడా చాలా మంచి ఫలితాన్ని అందిస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

