పాలల్లో ఈ ఒక్క స్పూన్ కలిపి తాగితే చాలు.. నరాల బలహీనత, నీరసం పరార్!
Wal Nuts Energy Milk In telugu : మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే నరాల బలహీనత, తీవ్రమైన అలసట, నీరసంతో బాధపడుతున్నారు. ఏ చిన్న పని చేసినా త్వరగా అలసిపోవడం, ఒళ్ళు నొప్పులు, నిస్సత్తువగా అనిపించడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి.
వీటికోసం వేలకు వేలు ఖర్చుపెట్టి ట్యాబ్లెట్లు, టానిక్లు వాడే బదులు.. మన ఇంట్లో ఉండే సహజమైన పదార్థాలతోనే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రోజూ తాగే గోరువెచ్చని పాలల్లో కేవలం ఒకే ఒక్క స్పూన్ ఈ పోషకాల పొడిని కలిపి తాగితే చాలు.. నరాలకు కొత్త బలం చేకూరుతుంది. శరీరంలో నీరసం, అలసట మాయమై రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఇంతకీ పాలల్లో కలపాల్సిన ఆ అద్భుతమైన పదార్థం ఏంటో, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
మనలో చాలా మంది ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు చిన్నగా ఉంటే ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. చిన్న .చిన్న పనులు చేసిన అలసట నిస్సత్తువ రావడం, ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవటం, రక్త ప్రసరణబాగా జరగడానికి, చురుకుగా ఉండటానికి ఇప్పుడు చెప్పే పాలు చాలా బాగా సహాయపడతాయి.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోసి రెండు వాల్నట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 5 కిస్ మిస్ లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఐదు నిమిషాలపాటు మరిగాక పటిక బెల్లం ముక్కలు వెయ్యాలి. ఈ పాలను గ్లాసులో పోసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.
ఈ పాలను తాగడం వలన తక్షణ శక్తి లభిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది. పిల్లలకు ఈ .పాలను ఇస్తే మెదడు పనితీరు మెరుగు పరచి పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది. పిల్లలు చదువు పట్ల శ్రద్ధ చూపుతారు. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
ఈ పాలను వారంలో 2 సార్లు తాగితే నరాలలో బలహీనత తగ్గుతుంది. నీరసం,నిసత్తువ, అలసట తగ్గి రోజంతా హుషారుగా ఉంటారు. వాల్ నట్స్ కాస్త ధర ఎక్కువైన దానికి తగ్గట్టుగా పనిచేస్తుంది. వాల్ నట్స్, కిస్ మిస్ అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ఈ పాలను తయారుచేసుకొని తాగితే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు.
మనకు అందుబాటులో ఉండే కొన్ని పదార్ధాలను ఇలా తీసుకుంటే వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అంది ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది నీరసంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి అమ్ఞ్చి ఎంపిక అని చెప్పవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

