Healthhealth tips in telugu

దాల్చిన చెక్క + వెల్లుల్లి.. ఈ రెండింటిని ఇలా తీసుకుంటే డయాబెటిస్, నరాల బలహీనత పరార్!

Garlic And cinnamon Benefits In telugu : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు డయాబెటిస్ (షుగర్ వ్యాధి) మరియు నరాల బలహీనత. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల కాళ్లూ చేతులు తిమ్మిర్లు ఎక్కడం, నరాలు బలహీనపడటం, తీవ్రమైన అలసట వంటి సమస్యలు తోడవుతాయి.

అయితే మందులతో పాటు మన వంటింట్లో ఉండే సహజ సిద్ధమైన ఆయుర్వేద గుణాలున్న పదార్థాలతో ఈ సమస్యలను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ‘దాల్చిన చెక్క మరియు వెల్లుల్లి’ కలిపి సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ పనితీరు మెరుగుపడి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.

అలాగే రక్త ప్రసరణ సాఫీగా జరిగి నరాలకు కొత్త బలం చేకూరుతుంది. మరి ఈ రెండు అద్భుత పదార్థాలను ఎలా తయారు చేసుకోవాలి? ఎప్పుడు, ఎలా తీసుకుంటే పూర్తి ఫలితం ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!

దాల్చిన చెక్క, వెల్లుల్లి రెండింటిలోను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ నియంత్రణలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు.
Garlic Benefits in telugu
ఒక్కసారి వచ్చింది అంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉండటమే కాకుండా దాని కారణంగా ఎటువంటి సమస్యలు ఉండవు. డయాబెటిస్ నిర్వహణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. వెల్లుల్లి తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది.

అలాగే జీర్ణ ప్రక్రియ బాగా సాగటానికి సహాయపడుతుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల డయాబెటిస్ నియంత్రిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది.జీర్ణక్రియను మెరుగు పరచడం వల్ల రక్తంలో గ్లూకోజ్ సాధారణ స్థితికి వస్తుంది.నరాల బలహీనత కూడా తగ్గుతుంది.

నిమ్మకాయలో కూడా విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి కూడా డయాబెటిస్ నియంత్రణలో సహాయపడతాయి.
ఈ డ్రింక్ రక్తంలో కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. దాంతో డయాబెటిస్ కారణంగా వచ్చే గుండె సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క, రెండు వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఒక గ్లాస్ లోకి వడకట్టాలి. దీనిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. ఏ సమయంలోనైనా తాగవచ్చు. అయితే తాగటానికి అరగంట ముందు కడుపు ఖాళీగా ఉండాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."