Healthhealth tips in telugu

పరగడుపున కాఫీలో 1 స్పూన్ నెయ్యి కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలిస్తే.. అస్సలు నమ్మలేరు!

Ghee Coffee Health benefits In telugu : ఉదయాన్నే వేడివేడి కాఫీ పడనిదే చాలామందికి రోజు గడవదు. అయితే, ఆ కాఫీలో కేవలం ఒక స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి కలుపుకుని పరగడుపున తాగితే ఎన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.

ముఖ్యంగా వేగంగా బరువు తగ్గాలనుకునే వారికి, ఉదయం లేవగానే నీరసంగా అనిపించే వారికి ఇదొక సంజీవనిలా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి, మెదడును చురుకుగా ఉంచే ఈ అద్భుతమైన కాంబినేషన్ వల్ల శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మనలో చాలామంది కాపీని చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు. కాఫీలలో కోల్డ్ కాఫీ, బ్లాక్ కాఫీ, చాక్లెట్ కాఫీ అంటూ ఎన్నో రకాలు ఉన్నాయి. రోజు ఒక కప్పు కాఫీ తాగితే ఎన్నో ఆరోగ్య పరియోజనాలను పొందవచ్చుని నిపుణులు చెబుతున్నారు.
coffee and cinnamon benefits
అయితే ఒక కప్పు కాఫీలో అర స్పూన్ నెయ్యి కలిపి పరగడుపున తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్న వారిలో Ghee Coffee తాగిన తర్వాత ఏదైనా ఆహారం తీసుకుంటే ఇన్సులిన్ నెమ్మదిగా విడుదలవుతుంది. డయాబెటిస్, జీర్ణ సంబంద సమస్యలు ఉన్నవారికి ఈ కాఫీ చాలా బాగా సహాయపడుతుంది. హార్మోన్లలో అసమతుల్యతను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.

Ghee Coffee తాగితే రోజంతా అలసట, నీరసం, నిస్సత్తువ లేకుండా చురుకుగా ఉంటారు. ఎందుకంటే నెయ్యిలో ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్‌ , ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్‌‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోజంతా హుషారుగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా తినాలని కోరికను తగ్గించి బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు పరగడుపున Ghee Coffee తాగితే చాలా మంచిది.

నెయ్యి ఆహారాన్ని తేలిక జీర్ణం చేయటమే కాకుండా చాలా తొందరగా శక్తినిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తూ శరీరంలో .పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాలు నాడీ కణజాలాల పెరుగుదలకు, పనితీరుకు సహాయపడతాయి. దాంతో మానసిక స్థితి బాగుండటానికి సహాయ పడుతుంది.

హార్మోన్ల ఉత్పత్తి.కి కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియకు అంతరాయం కలిగించే ఆమ్లాలను తట్టస్తం చేసి జీర్ణ క్రియ మెరుగ్గా జరిగేలా చేస్తుంది.
అయితే Ghee Coffee ని ఎప్పుడు తాగాలి అనే విషయానికొస్తే పరగడుపున తీసుకుంటే మంచిదని నిపుణులు చెప్పుతున్నారు. ఉదయం వ్యాయామం చేయటానికి ముందుగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

Ghee Coffee ని రోజులో రెండు సార్లు మించి ఎక్కువగా తీసుకోకూడదు. సాయంత్రం ఐదు తర్వాత తీసుకుంటే నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం పరగడుపున తీసుకొని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. కాస్త శ్రద్ద పెడితే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."