Healthhealth tips in telugu

జిమ్ లేకుండానే పొట్ట, తొడల కొవ్వును తగ్గించే నేచురల్ డ్రింక్ | Weight Loss Drink in Telugu

Apple Weight Loss Home remedies In Telugu : రోజూ ఉదయం ఈ 1 గ్లాసు నేచురల్ డ్రింక్ తాగితే చాలు, మొండి పొట్ట మరియు తొడల కొవ్వు సులభంగా తగ్గుతుంది. ఇంట్లోనే తయారు చేసుకునే పూర్తి విధానం ఇక్కడ చూడండి.

ఈ మధ్య కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, ఎక్కువ సేపు కూర్చుని ఉండటం, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు అలాగే పొట్ట బాగా పెరిగిపోతున్నాయి. వీటిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
garlic Health benefits
అయితే అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వక చాలా నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. నెల రోజులు పాటు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఈ డ్రింక్ తాగితే బరువు తగ్గుతారు. ఈ డ్రింక్ తయారీ కోసం ముందుగా నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక చిన్న ఆపిల్ తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి తురుముకోవాలి. ఆ తర్వాత అర అంగుళం అల్లం ముక్కను తీసుకొని పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దానిలో వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, రెండు స్పూన్ల యాపిల్ తురుము వేయాలి.
Ginger benefits in telugu
ఆ తర్వాత గ్లాస్ నిండా నీటిని పోసి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు తాగుతూ ఉంటే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దాంతో పొట్ట తగ్గి కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ అవుతుంది.

ఈ డ్రింక్ శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి మరియు అధిక బరువును తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గించి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ డ్రింక్ తయారుచేసుకొని తాగి అధిక బరువు సమస్యను తగ్గించుకోండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద ఇచ్చిన లింక్ copy చేసి చూడండి.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."