బరువు తగ్గాలని బ్రౌన్ రైస్ తింటున్నారా? రెడ్ రైస్ గురించి ఈ నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Weight Loss : బరువు తగ్గాలని నిర్ణయించుకోగానే మనలో చాలామంది చేసే మొదటి పని వైట్ రైస్ మానేయడం. కానీ తెలుగు వాళ్లకు అన్నం తినకుండా ఉండటం అంత సులభం కాదు కదా! అందుకే చాలామంది వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ వైపు మొగ్గు చూపుతుంటారు.
అయితే సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు “బ్రౌన్ రైస్ కొనాలా? లేక రెడ్ రైస్ కొనాలా? బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది త్వరగా పనిచేస్తుంది?” అనే సందేహం ప్రతి ఒక్కరికీ వస్తుంది.
చూడటానికి రెండూ ఆరోగ్యకరమైనవే అయినా, వాటిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు గ్లైసెమిక్ ఇండెక్స్‌లో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. మరి మీ వెయిట్ లాస్ జర్నీకి ఏది బెస్ట్ ఆప్షనో వివరంగా తెలుసుకుందాం.
ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ దాదాపుగా అధిక బరువు సమస్య అనేది ఉంది. అధిక బరువు విషయంలో మనం తీసుకొనే ఆహారం చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో చాలా మంది తెల్ల అన్నం తినటం మానేసి బ్రౌన్ రైస్, రెడ్ రైస్ వంటి వాటిని తీసుకుంటున్నారు.
అయితే బరువు తగ్గటానికి బ్రౌన్ రైస్, రెడ్ రైస్ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయం తెలుసుకుందాం. బ్రౌన్ రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పోషక పదార్ధాలను మరింత మెరుగుపరచటానికి సహాయపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే రెడ్ రైస్ కూడా ఒక తరహాలో ఉండే బ్రౌన్ రైస్ అనే చెప్పవచ్చు.
రెడ్ రైస్ లో మాంగనీస్ సమృద్దిగా ఉండుట వలన కణజాలం, ఎముకల ఏర్పాటులో సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టడం,జీవక్రియ,రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ , రెడ్ రైస్ రెండింటిలోను ఫైబర్, పోషకాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. శరీర జీవక్రియలకు,శరీరంలో కొవ్వు కరిగించటానికి బ్రౌన్ రైస్,రెడ్ రైస్ రెండూ దోహదం చేస్తాయి.
బ్రౌన్ రైస్ తో పోలిస్తే రెడ్ రైస్ కాస్త రుచికరంగా ఉంటుంది. తెల్ల అన్నంతో పోలిస్తే బ్రౌన్ రైస్, రెడ్ రైస్ తీసుకోవటం వల్ల ఆరోగ్య పరంగా మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు నిపుణులు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద ఇచ్చిన లింక్ copy చేసి చూడండి.
Source: chaipakodi.com

