వాల్ నట్స్‌తో ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు.. ముఖంపై టాన్ తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది!
Walnuts For Face: ఎండ, దుమ్ము, కాలుష్యం వల్ల మన ముఖం త్వరగా కళ తప్పి డల్‌గా మారిపోతుంటుంది. చర్మంపై మృతకణాలు (Dead Skin Cells) పేరుకుపోవడం వల్ల ఎంత ఖరీదైన క్రీములు రాసినా ముఖంలో ఆశించిన మెరుపు కనిపించదు. ఇలాంటప్పుడు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాల్ నట్స్ (అక్రోట్లు) చర్మ సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి.
వాల్ నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ E మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరిచి సహజమైన కాంతిని అందిస్తాయి. మరి పార్లర్‌కు వెళ్లే ఖర్చు లేకుండా ఇంట్లోనే వాల్ నట్స్‌తో ఫేస్ ప్యాక్ మరియు స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడితే మంచి ఫలితం ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.
ముఖం అందంగా తెల్లగా మెరవాలంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మన ఇంటిలో దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు.
వాల్ నట్స్ అంటే మనలో చాలామందికి ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రమే తెలుసు. కానీ వాల్ నట్స్ లో బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. వాల్ నట్స్ లో మెగ్నీషియం, జింక్, పాస్పరస్, మాంగనీస్, సెలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ ఇ వంటివి సమృద్ధిగా ఉంటాయి.
చలికాలం వచ్చేసింది. చర్మం పొడిగా మారిపోతుంది. చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండాలంటే వాల్ నట్స్ ని పొడిగా చేసుకుని ఆ పొడిలో తేనె కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం తేమగా మారి మృదువుగా యవ్వనంగా ఉంటుంది.
నల్లని మచ్చలు, మొటిమలు పోవాలంటే వాల్ నట్స్ తో ఈ ప్యాక్ తయారు చేసుకోవాలి. వాల్ నట్స్ పొడిలో రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద ఇచ్చిన లింక్ copy చేసి చూడండి.
Source: chaipakodi.com

