Healthhealth tips in telugu

కంటి చూపు మెరుగుపడాలంటే.. రోజూ ఈ చిన్న చిట్కా పాటించండి!

Eye sight increase Home Remedies in telugu : కంటి చూపు మందగించకుండా, కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇంట్లోనే సులభంగా పాటించగలిగే సహజ కంటి ఆరోగ్య చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.

ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు కంటికి సంబందించిన సమస్యలు వస్తున్నాయి. కంటి చూపు మెరుగుపడటానికి కంటికి సంబందించిన సమస్యలు తగ్గటానికి ఇప్పుడు చెప్పే ఆయుర్వేద చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.
eye sight remedies
దీని కోసం రెండు స్పూన్ల ఎర్ర కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. నానిన ఎర్రకందిపప్పును డ్రై రోస్ట్ చేసి ఉడికించాలి. ఉడికిన ఎర్రకందిపప్పులో నాలుగు మిరియాలను,ఉప్పు వేసి మెత్తని పేస్ట్ గా చేసి దానిలో ఒక స్పూన్ అవునెయ్యి వేసి బాగా కలిపి తినాలి.
masoor dal
ఈ విధంగా వారంలో రెండు సార్లు తీసుకుంటే కంటికి సంబందించిన సమస్యలు తగ్గటమే కాకుండా కంటి శుక్లం, కండరాల క్షీణత తగ్గుతాయి.
ఎర్రకందిపప్పులో విటమిన్ A,C,E సమృద్దిగా ఉండుట వలన కంటి చూపు మెరుగుదలకు కంటి సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. నెయ్యిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ సమృద్దిగా ఉండుట వలన కంటికి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

మిరియాలలో యాంటీ ఇన్ ఫ్లెమేటరీ లక్షణాలు ఉండుట వలన కంటి వాపును తగ్గించటంలో సహాయపడుతుంది. కాబట్టి ఇలా ఇంటి చిట్కాలు ఉపయోగిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ మనకు సులువుగానే అందుబాటులో ఉంటాయి. కాస్త ఓపికగా చేసుకోవాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద ఇచ్చిన లింక్ copy చేసి చూడండి.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."