Healthhealth tips in telugu

రోజూ కొన్ని గింజలను ఇలా వాడితే రక్తాన్ని శుద్ధి చేసి, కిడ్నీలను కాపాడుతుందని మీకు తెలుసా?

Toka Miriyalu Health benefits in telugu : తోక మిరియాలతో రక్తాన్ని సహజంగా శుద్ధి చేసుకోవడం ఎలా? కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఆయుర్వేద గింజలను ఏ మోతాదులో, ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

మనలో చాలా మందికి తోక మిరియాలు గురించి పెద్దగా తెలియదు. తోక మిరియాలను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ గింజలను తీసుకుంటే రక్తాన్ని ఫిల్టర్ చేయడమే కాకుండా కిడ్నీలను యాక్టివేట్ చేసి డీటాక్సిఫికేషన్ మరియు ప్యూరిఫికేషన్ చేయడంలో చాలా బాగా సహాయపడుతాయి..
Toka Miriyalu
తోక మిరియాలను వంటలో ఎక్కువగా ఉపయోగించరు. అందుకే మనలో చాలా మందికి ఈ తోక మిరియాల గురించి పెద్దగా తెలియదు. ప్రస్తుతం ఇవి ఆయుర్వేద షాపుల్లో విరివిగానే లభ్యం అవుతున్నాయి. తోక మిరియాలలో ఉండే సియోన్,కుబిబిక్ ఆమ్లం వంటి కెమికల్ కాంపౌండ్స్ కిడ్నీలలో ఫిల్టరేషన్ యాక్టివేట్ చేసి యూరిన్ ఎక్కువగా వచ్చేలా చేయడమే కాకుండా టాక్సిన్స్ బయటకు పోయేలా సహాయపడుతుంది.

తోక మిరియాలను ఉపయోగించడం వలన రక్తంలో టాక్సిన్ లోడు తక్కువ సమయంలోనే ఎక్కువగా తగ్గుతుందని 2019 లో జరిగిన పరిశోధనలో తేలింది.తోక మిరియాలలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ రక్తంలో ఇన్ ఫ్లమేషన్ మరియు శరీరంలో ఇన్ ఫ్లమేషన్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

తోక మిరియాలు ఒక పది గింజలు తీసుకుని మెత్తని పొడిగా చేసుకుని ప్రతిరోజు కూరల్లో కలుపుకోవడం లేదా ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తాగవచ్చు. ఇలా తీసుకుంటే కిడ్నీలు శుభ్రంగా ఉండి ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. శరీరంలో ఎక్కువగా టాక్సిన్ లు పేరుకు పోవటానికి నీళ్లు తక్కువ తాగడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మసాలాలు ఎక్కువగా తినడం వంటి వాటిని కారణాలుగా చెప్పవచ్చు.
toka miriyalu
ఈ అలవాట్లను మానేసి మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడానికి అలవాటు పడాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఆహారాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని తింటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద ఇచ్చిన లింక్ copy చేసి చూడండి.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."