Healthhealth tips in telugu

జిమ్‌కు వెళ్లకుండానే బాన పొట్ట తగ్గాలంటే.. రోజూ పరగడుపున ఈ 1 గ్లాసు డ్రింక్ తాగండి చాలు!

Bru Belly Fat Home remedies In telugu : పొట్ట చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును సహజంగా కరిగించుకోవడం ఎలా? రోజూ ఉదయాన్నే 1 గ్లాసు ఈ హోమ్ మేడ్ డ్రింక్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అలా సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా మనం బరువు తగ్గే ప్రయత్నంలో ఉండాలి.
Weight Loss tips in telugu
మనలో చాలా మంది అధిక బరువును తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా. కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. ఈ డ్రింక్ తయారు చేయటానికి నిమ్మకాయలు అవసరమవుతాయి. ఏడు నిమ్మ కాయలను తీసుకొని కట్ చేసి రసం తీసుకుని నిమ్మ చెక్కలను పాడేయకుండా ఈ రెమెడీకి ఉపయోగించాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి అర లీటర్ నీటిని పోసి దానిలో నిమ్మ చెక్కలను వేసుకోవాలి. .

ఆ తర్వాత రెండు పెద్ద సైజు దాల్చిన చెక్క ముక్కలను వేయాలి. ఆ తర్వాత ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత మూడు స్పూన్ల కాఫీ పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత పోయి ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారాక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు సీసాలోకి వడగట్టాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న నిమ్మరసం కలపాలి. .

ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెడితే ఐదు రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ డ్రింక్ ని ఎలా వాడాలో తెలుసుకుందాం. ఒక గ్లాసు తీసుకుని దానిలో ముప్పావు వంతు వేడి నీటిని పోయాలి. మిగిలిన పావు వంతు మనం తయారు చేసి పెట్టుకున్న డ్రింక్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తేనె కలపాలి. .

ఈ డ్రింక్ ని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగితే దాదాపుగా నెల రోజుల్లో బరువు తగ్గడాన్ని గమనించవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటే మంచిది. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. అలాగే సీజనల్ గా వచ్చే సమస్యలు కూడా ఉండవు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద ఇచ్చిన లింక్ copy చేసి చూడండి.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."