Kitchenvantalu

కేవలం 10 నిమిషాల్లో.. రాత్రి మిగిలిన అన్నంతో ఇంట్లోనే కరకరలాడే వడియాలు!

సాధారణంగా రాత్రి సమయంలో అన్నం మిగలటం జరుగుతూనే ఉంటుంది. కొంతమంది ఆ అన్నాన్ని పడేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది పులిహార, అన్నం తాలింపు, టమాటా రైస్ వంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు మనం మిగిలిన అన్నంతో క్రిస్పీ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

ఈ వడియాలు పప్పు, సాంబార్, రసం వంటి వాటికి సైడ్ డిష్ గా ఉంటుంది. అలాగే టీ టైంలో స్నాక్ గా కూడా ఉంటుంది.

అన్నం వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
మిగిలిన అన్నం
నువ్వులు
జీలకర్ర
ఉప్పు
కొత్తిమీర
నీళ్లు
టమాటాలు
పసుపు
కారం

తయారీ విధానం
ఒక కప్పు అన్నంలో ఒక కప్పు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. అన్నం మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత దానిలో టమాటా పేస్ట్, పసుపు, జీలకర్ర, నువ్వులు, కారంపొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించాలి.

అన్నం బాగా ఉడికిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి అన్నం మిశ్రమాన్ని కొంచెం కొంచెం గా తీసుకొని అప్పడాలు లాగా ఒక ప్లాస్టిక్ కవర్ పై ఒత్తుకోవాలి. రెండు రోజులు ఎండలో పెడితే ఎండిపోతాయి. ఈ వడియాలను గాలి చొరబడి డబ్బాలో పెట్టుకుంటే దాదాపుగా 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. వీటిని డీప్ ఫ్రై చేసుకుని తినడమే..

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."