Healthhealth tips in telugu

బరువు తగ్గాలా.. రోగనిరోధక శక్తి పెరగాలా? అయితే రోజుకో పండు తినండి!

సీజన్లో వచ్చే పండ్లను అస్సలు మిస్ కాకుండా తినటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే సీజనల్ గా వచ్చే సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. అలాంటి పండ్లలో apple ber ఒకటి.

దీనిలో విటమిన్స్, ఫ్లవనయిడ్స్, కనిజాలు, యాంటీ ఆక్సిడెంట్, పాలి సాకరైడ్స్ వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి. శరీరం నుండి హానికరమైన విషాలను బయటకు పంపడమే కాకుండా గుండెకు సంబంధించిన సమస్యలు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
apple ber benefits
ఈ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి ఎటువంటి ఇన్ఫెక్షన్ మన శరీరం దరికి చేరకుండా కాపాడుతుంది. ఈ పండులో ఉండే పొటాషియం కండరాల పనితీరు బాగుండేలా చేస్తుంది. అంతే కాకుండా శరీరంలో ఎలక్ట్రోలైట్ లో సమతుల్యంగా ఉంచుతుంది.

ఈ పండులో మన శరీరానికి అవసరమైన 24 ముఖ్యమైన అమైన ఆమ్లాలు ఉంటాయి. కాస్త అలసటగా ఉన్నప్పుడు ఈ పండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. ఎందుకంటే ఈ పండులో సహజమైన చక్కెరలు ఉంటాయి. ఈ పండులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన డయాబెటిస్ ఉన్నవారు కూడా లిమిట్ గా తినవచ్చు.

నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఒక పండు తింటే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది

ఈ పండులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటమే కాకుండా గ్యాస్. మలబద్ధకం సమస్యలు ఏమీ లేకుండా ఉంటుంది. అలాగే కడుపులో అల్సర్లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ లేకుండా కూడా చేస్తుంది.

ఈ పండులో పొటాషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, ఇనుము, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడమే కాకుండా ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని అవయవాలకు సరఫరా చేయడంలో కూడా చాలా బాగా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వయసు పెరిగే కొద్ది వచ్చే ఆల్జీమర్స్ సమస్యను తగ్గించి జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది.

ప్రోటీన్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపునిండా భావన ఎక్కువసేపు ఉండి ఆకలి నియంత్రణలో ఉండి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కాబట్టి మీరు కూడా ఈ పండుని తిని ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. ఎప్పుడైనా మంచి ఆహారమే మన ఆరోగ్యాన్ని శాసిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."