Kitchenvantalu

Kitchen Hacks: పప్పులు, బియ్యానికి పురుగు పడుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి!

సాధారణంగా మనం ఇంట్లోకి బియ్యం, కందిపప్పు, మినపప్పు వంటి పప్పుదినుసులను ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొని తెచ్చుకుంటూ ఉంటాం. అయితే, కొన్ని రోజులకే వాటికి పురుగు పడుతుంటుంది.

ముఖ్యంగా ఈ వానాకాలంలో వాతావరణంలో ఉండే తేమ వల్ల బియ్యం, పప్పులు చాలా త్వరగా పాడవుతాయి.

మీ ఇంట్లో కూడా ఈ సమస్య ఉంటే.. టెన్షన్ పడకండి. మీ వంటగదిలో ఉండే కొన్ని వస్తువులతోనే ఈ పురుగుల బెడదను వదిలించుకోవచ్చు. ఆ సింపుల్ కిచెన్ హాక్స్ (Kitchen Hacks) ఏంటో ఇక్కడ చూసేయండి!

పప్పులు, బియ్యం పాడవకుండా ఉండాలంటే..

వేపాకులతో చెక్: పప్పులు, బియ్యం నిల్వ చేసే డబ్బాలో కొన్ని ఎండిన వేపాకులను వేయండి. వేపాకు చేదు, ఘాటు వాసనకు పురుగులు దరిచేరవు. చాలా కాలం పాటు పప్పులు ఫ్రెష్‌గా ఉంటాయి.

వెల్లుల్లి రెబ్బలు: బియ్యం లేదా పప్పుల డబ్బాలో 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా అలాగే వేయండి. వెల్లుల్లి వాసన పురుగులను నివారిస్తుంది.

ముఖ్య గమనిక: మంచి ఫలితాల కోసం పప్పుల డబ్బాలో వేసిన వేపాకులు, వెల్లుల్లి రెబ్బలను వారానికోసారి మారుస్తూ ఉండాలి.

ఎండుమిర్చి ఘాటు: పప్పు దినుసులు నిల్వ ఉంచిన డబ్బాలో 3 లేదా 4 ఎండుమిరపకాయలను వేసి ఉంచండి. ఎండుమిర్చి ఘాటుకు పురుగులు ఆ దరిదాపుల్లోకి కూడా రావు.

లవంగాల మ్యాజిక్: పప్పులు స్టోర్‌ చేసిన డబ్బాలో 8 నుంచి 10 లవంగాలను తీసుకుని.. వాటిని ఒక చిన్న క్లాత్‌ బ్యాగ్‌ (బట్ట)లో కట్టి వేయండి. లవంగాల ఘాటైన సువాసనకు ఎప్పటికీ పురుగులు పట్టవు.

పై చిట్కాలు పాటించడంతో పాటు.. పప్పులు, బియ్యం నిల్వ చేసే డబ్బాలకు గాలి చొరబడకుండా (Airtight containers) చూసుకోవాలి. మూత ఎప్పుడూ టైట్‌గా ఉండేలా చూసుకుంటే ఎటువంటి పురుగులు పట్టవు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."