Healthhealth tips in telugu

మధుమేహానికి చెక్ పెట్టే న్యాచురల్ డ్రింక్.. రోజూ తాగితే షుగర్ లెవల్స్ నార్మల్!

డయాబెటిస్ (మధుమేహం) ఉందంటే చాలు.. తినే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే, షుగర్ వ్యాధి నియంత్రణలో డైట్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒకసారి డయాబెటిస్ బారిన పడితే జీవితకాలం మందులు వాడక తప్పదు. అయితే, మీరు వాడే మందులతో పాటుగా మనకు సులభంగా దొరికే రెండు వస్తువులతో ఓ చిన్న ఇంటి చిట్కా పాటిస్తే.. రక్తంలో చక్కెర స్థాయిలను చాలా ఈజీగా అదుపులో ఉంచుకోవచ్చు.

అదే తమలపాకు, నల్ల జీలకర్ర డ్రింక్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

డ్రింక్ తయారీ విధానం:
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లలో అర స్పూన్ నల్ల జీలకర్ర (Black Cumin Seeds) వేయండి.అందులోనే ఒక లేత తమలపాకును తీసుకుని, చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేయండి.

ఆ గ్లాసుపై మూతపెట్టి రాత్రంతా అలానే నాననివ్వండి.మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి పరగడుపున తాగండి.

ఈ నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలు:
ఈ డ్రింక్‌ను ప్రతిరోజూ తాగడం వల్ల డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండటమే కాకుండా, దానివల్ల భవిష్యత్తులో వచ్చే ఇతర అనారోగ్య సమస్యల ముప్పు కూడా తగ్గుముఖం పడుతుంది.

తమలపాకు: ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరంలో ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడిని (Oxidative stress) తగ్గించి కణాలకు రక్షణ ఇస్తాయి.

నల్ల జీలకర్ర (కలోంజి): ఆయుర్వేద షాపుల్లో లేదా ఆన్‌లైన్ స్టోర్స్‌లో సులభంగా దొరికే ఈ నల్ల జీలకర్ర, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి మధుమేహాన్ని నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది.

మర్చిపోకూడని ముఖ్య విషయాలు:
కేవలం డ్రింక్స్, మందులు వాడితేనే సరిపోదు.. షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం (వాకింగ్ లేదా యోగా) తప్పనిసరిగా చేయాలి. సరైన ఆహారపు అలవాట్లతో పాటు శారీరక శ్రమ తోడైతేనే డయాబెటిస్ పూర్తిగా అదుపులో ఉంటుంది.

డయాబెటిస్‌ను ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. లైట్ తీసుకుని షుగర్ లెవల్స్ పెరిగేలా వదిలేస్తే.. అది మెల్లిగా గుండె, కిడ్నీలు, కళ్లు, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే వ్యాధి ప్రారంభ దశలోనే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్త ఓపిక చేసుకుని ఉదయాన్నే ఈ హెల్తీ డ్రింక్ తాగడం అలవాటు చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."