మౌనరాగం సీరియల్ భరత్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు
సూర్య వంశం సీరియల్ లో జి తెలుగులో ప్రసారం కాగా అందులో కార్తీక్ పాత్రలో కనిపించాడు. సూర్యవంశం సీరియల్ 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఆ సీరియల్ లో భరత్ ని అందరూ అందులో చిన్నోడా అని పిలుస్తారు.ఆతర్వాత మౌనరాగం సీరియల్ లో పోలీసాఫీసర్ క్యారెక్టర్ రోల్ పోషిస్తున్న భరత్ బాగా పాపులర్ అయ్యాడట. బుల్లితెర ప్రేక్షుకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. నిజానికి భరత్ వచ్చాక ఈ సీరియల్ బాగా క్లిక్ అయింది. అప్పటినుంచే ఇంటరెస్టింగ్ గా మారిందట. భరత్ , అమ్ములు జోడీ చాలా బాగుందని పేరు వచ్చింది. అందుకే వీరిద్దరూ ఒకటైతే చూడాలని టివి పేక్షకులు కోరుకుంటున్నారు.

అమ్ములుని జైలునుండి విడిపించాక ఆమె తండ్రి చెప్పినట్లు ప్రతిరోజూ భరత్ ఇంటికి ఆమె పాలు పట్టుకుని వెళుతుంది. అలా ఆమెను రోజూ చూసే భరత్ ఇక ఒకరోజు ఆమె ప్రేమలో పడతాడు. అయితే భరత్ అసలు పేరు అట్లూరి రాజీవ్ రవిచంద్ర. యునైటెడ్ ఫిలిమ్స్ అనే సొంత ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ సంస్థ నిర్వహణలో ఇటీవల ‘నువ్వు తోపురా’అనే ఓ సినిమా విడుదలైంది.

బి హరనాధ్ బాబు డైరెక్షన్ చేసాడు. హీరో విజయ దేవరకొండ చేతులమీదుగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. సుధాకర్, నిత్యాశెట్టి హీరోహీరోయిన్స్ గా చేసారు. సన్ టివిలో ప్రసారమయ్యే ‘నీలా ఇలా ‘అనే సీరియల్ లో భరత్ నటిస్తున్నాడు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రసారం అవుతోంది. తమిళంలో ఈ సీరియల్ హిట్ కావడంతో తెలుగులో కూడా రావాలని భరత్ ఫాన్స్ కోరుకుంటున్నారు.

స్టార్ మా లో ప్రసారమయ్యే మౌనరాగం , నాన్నకు ప్రేమతో సీరియల్స్ లో నటిస్తున్న భరత్ ఒక కోణంలో హీరో సిద్ధార్ధ్ ని గుర్తుచేస్తాడు. మరో కోణంలో జీవాలా ఉంటాడు. ఋతురాగాలు సీరియల్ కి సీక్వెల్ గా వచ్చిన ఋతు గీతం సీరియల్ లో కూడా నటించాడు.అతనికి ఓ అక్క ఉంది. ఆమె కూతురు అంజలితో ఖాళీ సమయంలో భరత్ ఆడుకుంటూ ఉంటాడు. అలాగే ఫ్రెండ్స్ తో కల్సి అప్పుడప్పుడు క్రికెట్ ఆడతాడు.

