దగ్గుపాటి,అక్కినేని కుటుంబాలను కలపటానికి నలిగిపోతున్న సమంత
బిడ్డ వచ్చిన వేళా గొడ్డొచ్చిన వేళా అనే సామెతకు అనుగుణంగా నాగ చైతన్యను సమంత పెళ్ళాడి అక్కినేని వారి కోడలు అయ్యాక రెండు కుటుంబాల మధ్య సయోధ్య కు తెరితీసింది. ఈ మధ్య వెంకటేష్ కూతురు పెళ్ళిలో కూడా సమంత చేసిన సందడి అంతాఇంతా కాదు. ఇలా అక్కినేని,దగ్గుబాటి కుటుంబాల్లో ఆనందం నింపుతున్న సమంత రెండు కుటుంబాలకు వారధిగా మారిందన్న టాక్ వస్తోంది. కొత్త కోడలు వచ్చాక భలే ఉందే అనేలా వాతావరణం కనిపిస్తోంది. దీనికి పెద్ద కారణమే ఉంది. నిజానికి తెలుగు సినిమాకు రెండు కళ్లుగా భావించే ఎన్టీఆర్ ,అక్కినేని లలో అక్కినేనితో వియ్యం అందితే మంచిదని మెగా ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు భావించిందే తడవుగా అక్కినేని కొడుకు నాగార్జునకు తన కూతురు లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేసాడు.
కొన్నాళ్ళు కాపురం సాగినా తర్వాత తేడాలొచ్చేశాయి. అయితే అప్పటికే నాగచైతన్య పుట్టేసాడు. అదే సమయంలో తెలుగులో హీరోయిన్ గా మెరుస్తున్న అమలతో నాగ్ కి పరిచయం అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ కల్సి నటించిన శివ మంచి సెన్షేషనల్ హిట్ కొట్టడం,నిర్ణయం సినిమా బాగా ఆడడం,మరికొన్ని సినిమాలు కూడా చేయడం, ఇద్దరి మధ్యా బంధం బలపడడం నేపథ్యంలో లక్ష్మి దూరంగా జరిగింది. ఈలోగా అమలతో పెళ్లిదాకా వ్యవహారం రావడంతో లక్ష్మి విడాకులు ఇచ్చేసింది. ఇలా చేసేవేంటి అల్లుడు అని నాగ్ ని అడగలేని పరిస్థితి రామానాయుడికి ఉండేది. కయ్యం ఎందుకులే అని సర్దుకుపోయాడు. ఇంతకీ నాగ్ మళ్ళీ పెళ్లిచేసుకున్న అమలను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కూడా రామనాయుడిదే కావడం విశేషం.
ఇలా అక్కినేని ,దగ్గుబాటి కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయింది. ఎప్పుడైనా నాగార్జున తారసపడితే వెంకటేష్,సురేష్ లు హాయ్ అనేసి కడుపులో గల బాధను దిగిమింగుకునేవారు. అయితే సమంతా వచ్చాక పరిస్థితి మారింది. నాగ్ ,లక్ష్మిలకు పుట్టిన నాగ చైత్యన్యను సమంత ప్రేమించడంతో పెద్దలు పెళ్లి చేసారు. ఆ పెళ్ళిలో లక్ష్మి కీలక పాత్ర పోషించింది. అందుకే ఇటు అక్కినేని కుటుంబ పరువుని కాపాడుతూ హిట్స్ లేని భర్త నాగ చైతన్యకు మజిలీలో హిట్ అందించింది. మరోపక్క దగ్గుపాటి ఫ్యామిలీతో కూడా సత్సంబంధాలు నెరపుతోంది. వెంకటేష్ కూతురు పెళ్ళిలో సమంత వెరైటీ డ్రెస్ లతో అందంగా కనిపిస్తూ సందడి చేసింది. ఆ ఫొటోల్లో మంచివి ఏర్చి కూర్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా తన అభిమానాన్ని చాటుకుంది. ఇలా అక్కినేని,దగ్గుబాటి కుటుంబాల మధ్య ఒకప్పటి బంధాన్ని సమంత పునరుద్ధరిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటోంది.

