Movies

అక్కినేని ఇంటి పరువును సైతం భుజాన వేసుకున్న సమంత… ఎలానో చూడండి

సాధారణంగా హీరోయిన్స్ పెళ్లయ్యాక ఇంటికి పరిమితం అయిపోతారు. పిల్లల్ని కన్నాక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంటారు. ఇక హీరోలను ఇష్టపడి పెళ్లిచేసుకున్న హీరోయిన్స్ అయితే తమ భర్తకు అండదండ అందిస్తూ తెరవెనుక సూతధారులుగా మారిపోతుంటారు. బాలీవుడు స్టార్ హీరో అక్షయ కుమార్ పెళ్లాడిన హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా తెరవెనుకకు పరిమితమై భర్తకు బూస్టప్ ఇస్తోంది. అలాగే టాలీవుడు లో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా వచ్చి కుటుంబ పరువు కాపాడిన మహేష్ బాబు ని పెళ్లాడిన నమ్రతా శిరోద్కర్ కూడా సినిమాలకు గుడ్ బై చెప్పేసి భర్తకు అన్నివిధాలా సహకారం అందిస్తూ వస్తోంది. 

ఇక అక్కినేని ఇంట ఇన్నాళ్లూ నాగార్జున కుటుంబ ప్రతిష్టను కాపాడుతూ సినిమా రంగంలో తనకంటూ ఇమేజ్ తో కొనసాగారు. అయితే ఆయన కొడుకులు నాగచైతన్య,అఖిల్ విషయంలో ఎందుకో తేడా కొట్టింది. అఖిల్ మూడు సినిమాలు చేస్తే ఒక్కటీ హిట్ కొట్టలేదు. ఇక నాగ చైతన్య 17మూవీస్ చేస్తే అందులో హిట్ అయినవి మూడే మూడు. అవి కూడా సమంతాతో చేసిన ఏం మాయ చేసావే,మనం,ఇప్పుడు తాజాగా మజిలీ మూవీస్ కావడం విశేషం. నిజానికి సమంత నాగ చైతన్యను పెళ్ళాడి అక్కినేని వారి కోడలు అయ్యాక సినిమాలు తగ్గించలేదు సరికదా జోరు పెంచింది.

తమిళంలో అభిమన్యు తో హిట్ అందుకుంది. తెలుగులో యూటర్న్ మూవీతో లేడీ ఓరియెంటెండ్ మూవీ చేసి అదరగొట్టింది. మహానటిలో నటించి అందులోనూ మంచి పేరు కొట్టేసింది. ఇక ఆమధ్య చెన్నైలో హీరో సిద్ధార్థతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన చెన్నై భామ సమంతతో పెళ్లేమిటని నాగార్జున మొదట్లో అడ్డుచెప్పినా ఆతర్వాత ఒప్పుకుని పెళ్లి చేసాడు. అయితే వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న నాగచైతన్యకు కూడా మజిలీలో హిట్ ఇచ్చిన ఘనత సమంతదే. ఈవిధంగా అక్కినేని కుటుంబ పరువుని ఈ చెన్నై పిల్ల నిలబెడుతోందన్న టాక్ బలంగానే వినిపిస్తోంది. ఈ మధ్య వెంకటేష్ కూతురు పెళ్ళిలో కూడా సమంత చేసిన సందడి అంతాఇంతా కాదు. ఇలా అక్కినేని,దగ్గుబాటి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సమంత హీరోయిన్ గా రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసి తన సత్తా చాటుతోంది. 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."