వాళ్ళను కొట్టటం కోసమే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా….ఏమా కథ చూడండి
క్రీడలు,కళలు మాదిరిగా మార్షల్ ఆర్ట్స్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మనమీద మనకి కంట్రోల్ , పరిస్థితికి అనుగుణంగా స్పందించే నేర్పు మార్షల్ ఆర్ట్స్ వలన అలవడతాయి. సుమన్,భానుచందర్ లాంటి వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. కానీ పూర్తిస్థాయి మార్షల్ ఆర్ట్స్ సినిమాలు వాళ్ళు చేయలేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా మార్షల్ ఆర్ట్స్ వచ్చు. పవన్ సినిమాలకు గల స్టామినా ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో గుండెలపై బండలు వేసుకుని కొట్టించుకున్న పవన్ , చేతులమీది నుంచి కారు కూడా పోనిచ్చేలా చేసుకున్నాడు.ఇక జానీ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ద్వారా భార్యను కాపాడుకునే యత్నం చేసాడు.
నిజానికి బక్కపలచగా ఉండే పవన్ మార్షల్ ఆర్ట్స్ పట్ల విముఖత ప్రదర్శించేవాడట. మార్షల్ ఆర్ట్స్ అంటే చిన్నచూపు వెటకారం ఎక్కువగా ఉండేదట. మెగా బ్రదర్ నాగబాబు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంటే పవన్ వెటకారం చేసేవాడట. అన్నయ్య నాగబాబు నేర్చుకోమన్నా సరే పవన్ నేర్చుకోలేదట. బ్రూస్ లీ సినిమాలు చూసినా సరే మార్షల్ ఆర్ట్స్ మనకేం వస్తాయిలే అనుకునేవాడట.
అయితే చదువుకునే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఎవరో ఒకరు కామెంట్స్ చేసేవారట. వాళ్ళను ఏమీ అనలేని పరిస్థితిలో పవన్ ఉండేవాడు. కావాలనే ఎదురుగా చిరంజీవి గురించి కామెంట్స్ చేసేవారట. ఇక చెన్నై వెళ్ళినపుడు కూడా కొందరు చిరు మీద కామెంట్స్ చేయడం విన్నది. కానీ బలహీనంగా ఉండడం వలన ఎవరి మీదా చేయి ఎత్తలేని దుస్థితిలో ఉండేవాడట. కానీ కోపం తో ఊగిపోయేవాడట. దీంతో ఇక లాభంలేదని మార్షల్ ఆర్ట్స్ వైపు దృష్టిపెట్టాడట. అయితే ఎవరినో కొడదామని కాకుండా,మనమీద మనం కంట్రోలుగా ఉండడానికి మార్షల్ ఆర్ట్స్ దోహదం చేస్తాయన్న నమ్మకంతో నేర్చుకున్నాడు పవన్.

