Movies

చిరంజీవి,కొరటాల శివ సినిమాలో అనసూయ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

జబర్థస్త్ షోలో యాంకరింగ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ. ముందుగా కేవలం గ్లామర్‌తోనే షోను రక్తి కట్టించింది. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కేవలం గ్లామర్ షోకే పరిమితమైన అనసూయ.. ఆ తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’ సినిమాతో తనలో మంచి నటి ఉందని ప్రూవ్ చేసుకుంది. ఆ సినిమా తర్వాత రంగస్థలంలో రంగమ్మత్తగా అనసూయ నటనను ఎవరు మరిచిపోలేదు. ఈ సినిమాలో తన పాత్రలో అన్ని రకాల భావోద్వేగాలను పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లేటెస్ట్‌గా అనసూయ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న కొత్త సినిమాలో ముఖ్యపాత్రలో యాక్ట్ చేయబోతున్నట్టు దాదాపు ఖరారైంది.

అంతేకాదు చిరంజీవి సినిమాలో యాక్ట్ చేయడానికి అనసూయకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పారితోషకం ఇవ్వనున్నట్టు సమాచారం. దాదాపు ఒక చిన్నసినిమాలో నటించే హీరోయిన్‌కు ఇచ్చే పారితోషకాన్ని ఈ సినిమాలో ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్స్‌తో సమానంగా అనసూయ పాత్రను కొరటాల శివ డిజైన్ చేసినట్టు సమాచారం. మరోవైపు మెగాస్టార్ సినిమాలో ఆఫర్ అనేసరికి అనసూయ ఎలాంటి ఆలోచన లేకుండా ఈ సినిమాను ఓకే చేసినట్టు సమాచారం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."