బిగ్ బాస్ యాంకర్,పార్టిసిపెంట్స్ ఎవరు…. ప్రోగ్రాం ఎప్పటి నుంచి…???
బిగ్ బాస్ సీజన్ వన్ ,టు సక్సెస్ కావడంతో ఇక సీజన్ త్రీ కోసం కసరత్తు మొదలైంది. యాంకర్ తో పాటు కంటెస్టెంట్స్ ని కూడా వెతికే పనిలో పడ్డారు. జూన్ 16నుంచి స్టార్ మా యాజమాన్యం స్టార్ట్ చేస్తుందని టాక్ బయటకు వచ్చింది. కంటెస్టెంట్స్ విషయానికి వస్తే,సింగర్స్ హేమచంద్ర,శ్రావణి భార్గవిలలో ఒకళ్ళని,అలాగే జబర్దస్త్ లో లేడీ గెటప్ లో కనిపించే వినోదిని,రఘు మాస్టారు, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, బిందు మాధవి, పొట్టి నరేష్ పేర్లు వినిపిస్తున్నాయి. సెట్ వర్క్ హైదరాబాద్ లోనే వేస్తున్నారు. ఇక సీజన్ త్రికి యాంకర్ కోసం చాలామందిని కన్సల్ట్ చేసారు.ముఖ్యంగా సీజన్ వన్ కి యాంకర్ గా అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్ కోసం బిగ్ బాస్ నిర్వాహకులు చాలా ప్రయత్నం చేసారు.
కానీ ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ లో చేసున్న జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కడా డేట్స్ కుదరని పరిస్థితి నెలకొంది. నిజానికి జూనియర్ పేరు కన్ఫర్మ్ అయినట్లు వినిపించినా అది నిజం కాదని తేలిపోయింది. అలాగే విజయ్ దేవరకొండ,నాగార్జున పేర్లు వినిపించాయి. కానీ వాళ్ళూ నో చెప్పేసారు. కాగా మెగాస్టార్ చిరంజీవి యాంకర్ గా వస్తాడని కూడా ప్రచారం జరిగింది. కానీ సైరా మూవీతో బిజీ గా ఉండడం,తర్వాత కొరటాల శివ తో మూవీ పట్టాలెక్కనున్న నేపథ్యంలో ఆయనకు కుదరదు.
అయితే విక్టరీ వెంకటేష్ పేరు కూడా వినిపించింది. అయితే ఎఫ్ 2ప్రమోషన్ లో భాగంగా బిగ్ బాస్ చేస్తున్నారా అని అడిగితే చేయడం లేదని వెంకటేష్ స్పష్టం చేసేసాడు. అయితే వెంకటేష్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. ఇక లేడీ యాంకర్ గా అనుష్క పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే వెంకీ కాదన్న పక్షంలో నవదీప్ హోస్ట్ గా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యితడు వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొన్నాడు కూడా.
