Movies

ప్రభాస్ కి పునర్జన్మ… షాకిస్తున్న సాహో స్టోరీ

ఒక్కో సినిమాతో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి మూవీతో ఏకంగా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిపోయాడు. హాలీవుడ్,బాలీవుడ్ కి ధీటైన హీరోగా ఎదిగాడు. ఇక తదుపరి మూవీ కూడా అదే రేంజ్ లో ఉండాలన్న ఉద్దేశ్యంతో 200కోట్ల భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్స్ సాహు ని నిర్మిస్తున్నారు. సుజిత్ డైరెక్షన్ లో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా చేసున్న ఈ మూవీ గురించి నేషనల్ మీడియాలో సెన్షేషనల్ కథనాలు వస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని భావిస్తున్న సాహు మూవీ గురించి అసలు కథ ఎలా ఉంటుందో కూడా అసలు యూనిట్ ఇప్పటివరకూ బయట పెట్టలేదు. అయితే ఈ మూవీలో ప్రభాస్ వజ్రాల దొంగగా సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. ఇందులోని యాక్షన్ సీన్స్ ,ఛేజింగ్ దృశ్యాలు గతంలో ఎప్పుడూ చూడని విధంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే యాక్షన్ సన్నివేశాలు కాకుండా బలమైన కథనంతో ఈ సినిమా తీస్తున్నట్లు టాక్. 

పునర్జన్మ నేపథ్యంలో అందరినీ ఆశ్చర్య పరిచేలా ఈ సినిమా ఉంటుందని వినిపిస్తోంది. మరణించి మళ్ళీ జన్మించి ప్రతీకారం తీర్చుకోడానికి ప్రభాస్ ప్రయతించడమే సాహూ మూవీలో ప్రధాన అంశగా వార్తలు వస్తున్నాయి. ప్రతీకార నేపథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. రోజురోజుకి అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమా కథ,కథనం గురించి విడుదలకు ముందు చిత్ర బృందం చెబుతుందా లేక సస్పెన్స్ కొనసాగిస్తుందా అనేది అర్ధం కావడం లేదు. అసలు ఈ మూవీ ఆ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."